చంద్రవంశం

0
4

[box type=’note’ fontsize=’16’] బాల పాఠకుల కోసం చంద్రవంశం రాజుల వివరాలను సరళమైన రీతిలో అందిస్తున్నారు డా. బెల్లంకొండ నాగేశ్వరరావు. [/box]

[dropcap]వి[/dropcap]వస్వతుడు ద్వాదశాదీత్యుల్లో ఒకడు, యితని తండ్రి కశ్యపుడు. తల్లి అదితి. ఇతన్నే సూర్యుడు అని కూడా అంటారు.విశ్వకర్మ కుమార్తెలగు సంజ్ఞాదేవి, ఛాయాదేవిలను వివాహం చేసుకున్నాడు.ఇతనికి వైవస్వతుడు (ఇతను మనువు) యముడు, శని అనే ముగ్గురు పుత్రులు, యమున, తపతి అనే ఇరువురు కుమార్తెలు జన్మించారు.

వైవస్వతునికి శ్రాధ్ధదేవుడనే పేరు కూడా ఉంది. భార్య శ్రధ. వీరికి ఇక్ష్మావాకుడు, నృగుడు, శర్యాతి, దిషుడు, ధృష్టుడు, కరూశుడు, నరిష్యంతుడు, వృషద్రుడు, నభగుడు, కవి అనే పదిమంది పుత్రులు జన్మించారు. వీరిలో కవి అనువాడు బాల్యంలోనే మరణించాడు. ఇతని పెద్ద కుమారుడు ఇక్ష్వాకుడు, అతని కుమారుడు కుక్షి. అతని తమ్ముడు నిమి. ఈ ఇక్ష్వాకవంశం వారి రాజధాని అయోధ్య. వైవస్వతుని పుత్రుల్లో కురూశుడు కురూశవంశానికి మూలపురుషుడు.

సంతతి కలగకముందు వైవస్వతుడు యాగం చేసి తమకు పుత్రుడు కావాలని వసిష్ఠుని వేడుకోగా “సుద్యుమ్నుడు” అనే కుమారుడిని ప్రసాదించాడు. అలా జన్మించి పెరిగి పెద్దవాడైన సుద్యుమ్నుడు  ఓ పర్యాయం వేటకు వెళ్ళి శరవణవనం లోనికి వెళ్ళాడు. ఆ వనంలో ప్రవేశించిన పురుషులు ఎవరైనా స్త్రీ గా మారిపోతారు అన్నకారణంగా అతను”ఇల” అనే పేరు కలిగిన స్త్రీ రూపం పొందాడు. అలా సోముని కుమారుడైన బుధుని ద్వారా పురూరవుడు-అతని భార్యఊర్వశి. వారికి ఆయువు భార్య స్వర్బాన, వారికి నహుషుడు-ప్రియంవద, వీరికి పూరుడు-కౌసల్య. వారికి జనమేజేయుడు-అనంత. వీరికి ప్రాచీశుడు-నశ్మి-వారికి సంయాతి-వరాంగి. వారికి నహంయాతి-భానుమతి.వారికి సార్వభౌముడు-సునంద. వారికి జయత్సేనుడు-సుశ్రవసు. వారికి అవాచినీడు-మర్యాద. వారికి నరిహుడు-నాంగి. వారికి మహొభౌముడు-పుష్టి. వారికిఅయుతానీకుడు-కామా. వారికి అక్రోధనుడు-కాళంగి. వారికి దేవతిధి-వైదేహి. వారికి ఋచీకుడు-నాంగి-లేక దేవ. వారికి ఋక్షుడు-జ్వాల. వారికి మతినారుడు-సరస్వతి కలిగారు. వారికి త్రసుడు-కాళింది. వారికి కిలుడు-రిథంతరి. వారికి దుష్యంతుడు-శకుంతల. వారికి భరతుడు-సునంద. వారికి భూమాన్యుడు-విజయ.వారికి సుహోత్రుడు-సువర్ణ. వారికి హస్తి-యశోధర. వారికి వికుంఠనుడు-వసుదేవ. వారికి అజామీఢుడు-కైకేయి. వారికి సంవరుణుడు-తపతి. వీరికి కురుడు (కురువంశానికి మూలపురుషుడు) శుభాంగి. వీరికి విథూరధుడు-మాధవి లేక సంప్రియ. వారికి అనశ్వుడు-అమృత. వారికి పరిక్షిత్తు-సుయశ. వారికి భీమసేనుడు-కుమారి. వారికి పరిశ్రవసుడు-వారికి ప్రతీపుడు-సునంద. వారికి శంతనుడు-గంగాదేవి లకు భీష్మడు, సత్యవతికి చిత్రాంగదుడు-అంబిక. విచిత్రవీరుడు-అంబాలిక. వీరికి ధృతరాష్టృడు-పాండురాజు కలిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here