నీటి తపస్సు

1
5

[box type=’note’ fontsize=’16’] “నీరు లేనిదే మీరు లేరు, జలం లేనిదే జగం లేదు, అందుకే…. విజ్ఞతతో మేల్కొందాం” అంటున్నారు కయ్యూరు బాలసుబ్రమణ్యంనీటి తపస్సు‘ కవితలో. [/box]

నీరే సమస్త జీవులకు ప్రాణం
అశ్రద్థ చేస్తే తప్పదు జలరణం
నీరు మనకు ఎంతో పదిలం
నిర్లక్ష్యం చేస్తే జీవజాతి శిథిలం
జలాన్ని నిత్యం చేస్తే వృథా
తప్పదు అనునిత్యం వ్యథ
పొదుపు చేయకపోతే నీరు
చివరకు మిగిలేది కన్నీరు
నీరు లేనిదే మీరు లేరు
జలం లేనిదే జగం లేదు
అందుకే ….
విజ్ఞతతో మేల్కొందాం
ఇంకుడు గుంతలు నిర్మిద్థాం
వర్షపుచినుకును ఒడిసి పడదాం
భూగర్భజలాన్ని సంరక్షిద్థాం
ఇంటికో మొక్కను నాటుదాం
జలయజ్ఞానికి సన్నిద్థమవుదాం
నీటితపస్సుకు నిమగ్నమవుదాం
సుజలం కోసం భగీరథలవుదాం
జన్మభూమికి అంకితమవుదాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here