[box type=’note’ fontsize=’16’] “అందరూ కలవాలి, ఒక్కమాటపై నిలవాలి, ఒక్క బాటపై నడవాలి” అంటూ, అలాంటి ‘ఆనంద వేదిక‘ కావలని కోరుతున్నారు పి.యం.జి. శంకర్రావు ఈ కవితలో. [/box]
[dropcap]ఇ[/dropcap]ది ఒక ఉదయం
మహోదయానికి శుభోదయం
మబ్బు తొలగిన వేళ
మనసు విరిసిన వేళ
స్పందన నీడలో
జోల పాడిన వేళ
కలలు విరిసిన వేళ
కదలి వచ్చిన వేళ
కల్మషాలు విడిచి
ఒక్కటైన వేళ
సూర్యచంద్రులు
కలసి వచ్చిన వేళ
వర్గ భేదాలను
విడచి వచ్చిన వేళ
అభివృద్ధి కొరకు
బాటలేసిన వేళ
మహారథులు వచ్చి
మాట కలిపిన వేళ
ముద్దు ముద్దు మాటలు
ముచ్చటించిన వేళ
అరమరికలు లేక
ఆనందించిన వేళ
అందరూ కలసి
ఒక్కటైన వేళ
పుడమి తల్లి ఒడిలో
పులకించిన వేళ
ఉద్యానవనంలో
విహరించిన వేళ
మల్లెలన్నీ కలసి
మాటలాడిన వేళ
ముద్దబంతి వచ్చి
ముద్దులిచ్చిన వేళ
గులాబి వచ్చి
గుబులు రేపిన వేళ
చేమంతులు వచ్చి
సేదతీరిన వేళ
సన్నజాజులు వచ్చి
లతలు అల్లిన వేళ
ఇలాంటి వేళ కావాలి
ఇలాంటి వేదిక సాగాలి
ఇలాగే అందరూ కలవాలి
ఒక్కమాటపై నిలవాలి
ఒక్క బాటపై నడవాలి
ఇదే మన సాంప్రదాయం
ఇదే ఇదే మన సాంప్రదాయం.