[box type=’note’ fontsize=’16’] నిజమైన మకర సంక్రాంతి ఎప్పుడో ఈ కవితలో వివరిస్తున్నారు డా. విజయ్ కోగంటి [/box]
[dropcap]కొ[/dropcap]త్తగా
చిగురింపచేసే భావనొకటి
నిను పులకింపచేస్తే …!
ద్వేషాలను దాటి
మరో మనిషిని ప్రేమించగల శక్తి
నీలో జనిస్తే…!
నీకే తెలియని
ఒక తీయని స్వచ్ఛతగల ప్రేమ
కొత్తనదిలా నీలో కదలాడితే…!
నీ గుండె కుదురులో
ఎప్పుడో చిక్కుకున్న బంధమొకటి
మొలకెత్తి నవ్వుతూ పలకరిస్తే…!
నిన్నో వెలుగును చేస్తూ
అహాన్ని చీల్చిన మనసు
నీలోనే వుదయిస్తే…!