మరణ వాంగ్మూలం

1
4

[box type=’note’ fontsize=’16’] Pablo Neruda గారి స్పానిష్ కవిత, ఆంగ్లంలో తర్జుమా కాబడిన “you start dying slowly” కి విసురజ స్వేచ్చానువాదం ఈ “మరణ వాంగ్మూలం“. [/box]

[dropcap]ప్ర[/dropcap]యాణాలు అత్యవసరమైన
కష్టమని నీవు మానుకుంటే

చదువులెన్నో చదవాల్సివచ్చిన
శుద్దదండుగని నీవు వూరుకుంటే

క్రొత్తతలపులెన్నో ఉదయించిన
మనసుర్రూతలూగినా నీవు వినకుంటే

మమతరాగాలెన్నో వసంతగానాలైన
వయసల్లరిచేసినా నీవు తెలియకుంటే

నెమ్మదిగా నీవు నిస్తేజమవుతున్నట్టే
మరణానికి నీవింక చేరువవుతున్నట్టే

ఆత్మగౌరవాన్ని అంతర్మధనాన్ని
ఆత్మీయతను నీవు సమాధిచేసుకుంటే

ఎదుగదలలో బ్రతుకునెరుపుటలో
జీవనయాత్రలో నీవు మేధావినుకుంటే

చెడ్డలవాట్లకు దుర్వ్యసనాలకు
దుర్భాషలకు నీవు దుర్భరబానిసైతే

మార్పుచెందక తీరుతెన్నుమార్చుకోక
తప్పుదారిలో నీవు వద్దన్నపోతుంటే

నెమ్మదిగా నీవు నిర్వీర్యమవుతున్నట్టే
మరణానికి నీవింక చేరువవుతున్నట్టే

జీవితరంగులను ఆస్వాదించలేకపోతే
కొత్తొళ్ళసాంగత్యాన్ని నీవు నచ్చలేకుంటే

కళ్ళల్లోమెరుపులను కారణామైనవార్ని
మమతలను నీవు దూరంచేసుకుంటే

హృదయపుగొంతులను నొక్కిపెట్టేస్తే
రసస్పందనలకు నీవు నిర్లక్ష్యంవహిస్తే

ఉద్యోగపుభారాన్ని బరువుగామోస్తుంటే
నచ్చని నౌఖరిని నీవు తోసిరాజనకుంటే

నెమ్మదిగా నీవు విఫలమైనట్టే
మరణానికి నీవింక చేరువవుతున్నట్టే

తీరునచ్చనిచోటును మెచ్చలేకపోతుంటే
మనసైనట్టు నీవు మార్పుచేసుకోకుంటే

ఒప్పలేనివలపుని తప్పలేకపాలిస్తుంటే
అనిశ్చితభీతితో గెలుపుదారినివీడితే

కలలదారంటా కడదాకసాగకుంటే
తప్పుడుసలహాకార్ల తాటతీయకుంటే

బ్రతుకునావను సరిదిద్దుకోకుంటే
ఆనందాలజలధిలో ఓలలాడకుంటే

నెమ్మదిగా నీవు నీరసపడిపోతుంటే
మరణానికి నీవింక చేరువవుతున్నట్టే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here