[box type=’note’ fontsize=’16’] “కంటికి కనిపించని కన్ను ఒకటుందట, అది తెరచి చూస్తే అగచాట్లు పోతాయట” అని అంటున్నారు శంకరప్రసాద్ ‘మూడో కన్ను‘ కవితలో. [/box]
[dropcap]వి[/dropcap]శ్వమంత విషాదం నాది
రోదసిలో కూర్చుని రోదిస్తున్నా
చుక్కల కన్నీటి చుక్కలు రాలుతున్నాయ్
అమావస్యేమో అంతా చీకటి
చంద్రుడు సూర్యుడు కనపడరే
నేల విడిచి నింగి సాము చేస్తే ఇంతేనేమో
పుడమి తల్లి దూరమయ్యి
కష్టాల రక్కసి కౌగలించుకుంది
రెండు కళ్ళూ తెరచి చూస్తున్నా
జీవిత సత్యం గోచరించదే, నా గోచారామా
కంటికి కనిపించని కన్ను ఒకటుందట
అది తెరచి చూస్తే అగచాట్లు పోతాయట
ఆ కన్ను కోసం వెతుకుతున్నా
విశ్వమంతా గాలిస్తున్నా
ఆకాశవాణి సెలవిచ్చింది
నీలోనే కన్ను ఉంచుకొని నాలో వెతుకుతావెందుకని…
నా కన్నేమయినా మీకు కనిపించిందా..
అయ్యలారా చెప్పి పుణ్యం కట్టుకోండి.