[box type=’note’ fontsize=’16’] “అశలో నిరాశ చేరకుంటే భవిష్యత్తు రంగురంగులేగా” అంటున్నారు విసురజ ‘జంట పద(స్వరా)లు‘ అనే ఈ కవితలో. [/box]
[dropcap]రూ[/dropcap]పంలో ప్రతిరూపం ఇమిడితే
చిత్రం విచిత్రమేగా
తృప్తిలో సంతృప్తి వుంటే
జీవితం అనందమయమేగా
కీర్తనతో సంకీర్తనలు సాగితే
జగము డోలలూగేనుగా
బోధతో ఉద్బోధలు జరిగితే
జీవనం సుఖమయమేగా
చనువులో అతిచనువును చూపిస్తే
నెయ్యం నరకమయ్యేగా
మాన్యులు సామాన్యులు కలిసిపోతే
లోకం ఆనందసాగరమయ్యేగా
వచనతో ప్రవచనాలు వల్లించితే
వ్యవహారం చక్కబడేగా
దృష్టితో దూరదృష్టి జతకూడితే
జయం ఇంటిపేరయ్యేగా
జయంతో అపజయాలు కలగలిస్తే
విధిబలీయం తెలిసేగా
కధలో పిట్టకధలు కూర్చితే
కావ్యం మెచ్చబడేగా
కళ్ళళ్ళో నకళ్ళను నిలుపుకోకుంటే
భవితవ్యం బంగారమేగా
అశలో నిరాశ చేరకుంటే
భవిష్యత్తు రంగురంగులేగా