[dropcap]ని[/dropcap]న్ను తలిస్తే
నా గుండెల్లో అల్ప పీడనం
నిన్ను చూస్తే
నా మనసంతా వాయు గుండం
ఇదో కొత్త రకం తుఫాను
వలపు తుఫాన్
ముంచుకొస్తోంది
నీ తలపులతో
వేగం పెంచుకొని
ఉప్పెనలా ఉప్పొంగి వస్తోంది
సహాయక చర్యలు
చేయవా నేస్తం
నీ ప్రేమ నావలో
ఈ అల్ప జీవిని వేసుకొని
తీరం దాటించు
నా తీరని వ్యథను వదిలించు
దివి దీవికి తరలించు…