[dropcap]అ[/dropcap]లనాటి జ్ఞాపకాలలో రేడియో
స్వాతంత్ర సమరంలో
వారధిగా ఉంటూ…
మొదట ప్రచార సారథి
వార్తావాహిని
ఆరు బయట పాటలు వింటూ…
ఆనందముతో పులకరిస్తూ..
వార్తలు వింటూ
లోకజ్ఞానము తెలుసుకుంటూ…
క్రికెట్ కామెంటు వింటూ
విజయాలను పంచుకుంటూ….
కథలు నాటికలు వింటూ
వినోదాలు పంచుకుంటూ…..
విద్యార్థులు పాటలు వింటూ
జ్ఞానాన్ని పెంచుకుంటూ……
పాడి పంట ప్రసారాలలో
రైతు సోదరులు సలహాలు వింటూ
సమయము కోసం
రేడియోలో సమయము తెలుసుకుంటూ…
గుడిలో పెట్టి రేడియో
ఊరిలో వారిని నిద్రలేపుతూ….
ఎన్నికలలో గెలుపోటముల కోసం
తెల్లవార్లు రేడియో ముందర వింటూ…