[dropcap]నీ[/dropcap]దీ నాదీ అనే రెండు ప్రపంచాలలో
మనసును ‘కొనే’ జనాల మధ్య
మన కోసం మనం ఎంత వెతుక్కుంటున్నాం!
ఎంత తిరుగాడుతున్నాం!
నువ్వు నా కోసం… నేను నీ కోసం
కట్టిన గాలిమేడల్లో విహరిస్తూనే వున్నాం,
కదూ…!
స్నేహానికే తేడాలూ లేవు
కులమతాలు అడ్డురావు
అదే ఆడా మగా అయితే
ఓహో అడ్దుగోడ లెన్నెన్నో.
హర్షించని ప్రపంచపు రీతుల్లో
వర్షించని నా చూపుల దారుల్లో
నీ కోసం నా ఆశల దీపాల్ని
వెలిగిస్తూనే వుంటా
నీ కోసం నేనే దీపమై
వెలుగుతూనే వుంటా.