[dropcap]తె[/dropcap]లుగు తేనెలొలుకు తెలుగు
తేట తేట తెలుగు తెలుగు వారింట
వెలుగు నింపిన తెలుగు
ప్రాచీనమునందు పరవశించిన తెలుగు
గ్రాంథికమున గర్వపడిన తెలుగు
వ్యవహరికమున ఎగిసి పడిన తెలుగు
మూడు దశలందు ముద్దులొలికిన తెలుగు
ఆదునికమందు అందుబాటు కరువు
అమ్మ పలుకు లేదు నాన్న పిలుపు లేదు
బామ్మ మాట లేదు అన్న
అరుపు లేదు చెల్లి పదము చేదు.
ఆంగ్ల పలుకులతోనే ఆదమరిచిన పిలుపు
ఆదరణ కరవై అంతమైన పలుకు.