[dropcap]న[/dropcap]ల్గురిల బతుకుతున్నపుడు
నల్గురు మెచ్చె పనిజెయ్యాలనే
సోయి ఉండాలే…
నల్గురికి మేలు జేసుకుంట
నరజన్మకి సార్ధకం చేసుకోవల్నని
సోయి ఉండాలే…
నల్గురిల తిరుగుతుంటే
నవ్వులపాలు చేయని బట్ట మీద
సోయి ఉండాలే…..
నల్గురిల మెదులుతుంటే
నాలుక మాట్లాడే మాటమీద
సోయి ఉండాలే….
నల్గురిల లేక ఒంటిగ ఉంటె
నాటకమాడే మనసు మీద
సోయి ఉండాలే…….
నల్గురికి మేలు జెయ్యక పోయిన
నల్గురికి కీడు జెయ్యద్దనే
సోయి ఉండాలే…….