సిగ్నల్ – పుస్తక పరిచయం

0
4

[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ రచయిత, అనువాదకులు శ్రీ రంగనాథ రామచంద్రరావు వివిధ భాషల నుంచి అనువదించిన ప్రసిద్ధ కథల సంకలనం ‘సిగ్నల్’.

రష్యన్, కోస్టారికన్, స్పానిష్, ఫ్రెంచ్, మంగోలియన్, బెల్జియం, చైనీస్, అమెరికన్, ఇంగ్లీష్, హంగేరియన్, కొలంబియన్, నార్వే, అల్బేనియన్, ఆస్ట్రియా, జెకోస్లోవేకియా, జర్మన్, నేపాలీ భాషలలో సుప్రసిద్ధ కథకులు రచించిన కథలను రామచంద్రరావు తెలుగులోకి అనువదించారు. మొత్తం 21 కథలున్నాయి.

***

“ఫ్రెంచ్‌లో పుట్టిన కథారూపం, అమెరికన్, రష్యన్ రచయితల చేతుల్లో పరిపూర్ణంగా రూపుదిద్దుకుని ఓ తిరుగులేని సాహితీ ప్రక్రియగా మారింది. ప్రపంచసాహిత్యంలో అనేకానేక అద్భుతమైన కథలొచ్చాయి. వాటిల్లో కొన్నిటిని ఏరికూర్చి ఈ సంకలనంలో చేర్చారు. ఇందులోని కథలు కాలక్షేపం కబుర్లు కావు. గట్టిగా మనసుని తట్టి, మనల్ని మనం సమీక్షించుకునేలా చేసే ఆప్తవాక్యాలు. జాడ కనిపించకుండా పోతున్న కరుణ, దయ మొదలైన మానవీయ విలువల్ని గుర్తుచేసే చిరుదీపాలు. ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాల్లా ఉండే ఇంత చక్కటి కూర్పుని తెలుగు పాఠకుల ముందుకు తీసుకురావడం రంగనాథ రామచంద్రరావుగారికే సాధ్యం” అన్నారు ‘ఛాయ’ కృష్ణమోహన్ బాబు.

***

”మన జీవితాలను రూపొందించేది దేవుడు మాత్రం కాదు. మన తోటివారే. అంటే మనుషులే. ఈ ‘మనిషి’ అంతటి క్రూరమైన ప్రాణి జగత్తులో మరొకటిలేదు. ఒక తోడేలు మరో తోడేలును ఎప్పుడూ తినదు. కానీ, మనిషి అలా కాదు. తోటివాణ్ణే తిని త్రేన్చేస్తాడు.” – ‘సిగ్నల్’, రష్యన్ కథ నుంచి.

***

”ప్రజలంతా ఎడారి నక్కలకు భయపడతారు కానీ, అసలు క్రూరమృగాలు వీళ్లేనమ్మా! వీళ్లే” అనుకుంటాడు స్యాండి, తన కూతురుతో పాటు నడుస్తూ. – ‘ఎడారి నక్క’,  మంగోలియన్‌ కథ

***

“మీరెలా నా పిల్లలో వారూ అలాగే! గాయపడి చావు బతుకుల మధ్య పోరాడుతున్న వో అబ్బాయిని అతని స్నేహితులు తీసుకుని ఆశ్రయం కోసం ఇక్కడికి వచ్చారు. ఆకలి, అలసటతో, యిప్పటికే సగం చచ్చినట్టున్నారు…” అంది.

మళ్ళీ –

“ఈ ఒక్క రాత్రి… ఈ క్రిస్‌మస్ రాత్రయినా మనం యుద్ధాన్ని మరుద్దాం” కార్పోరల్‌ని చూస్తు మళ్ళీ అంది.” – ‘చీకట్లో చిరుదీపం’, ఆంగ్ల కథ నుంచి.

***

పుస్తకం : సిగ్నల్

(ప్రపంచ భాషల ప్రసిద్ధ కథలు)

అనువాదం : రంగనాథ రామచంద్రరావు

పేజీలు : 160, ధర : ₹125/-

ప్రతులకు : పల్లవి పబ్లికేషన్స్‌, డా. ప్రేమ్‌చంద్ కాంప్లెక్స్, 1 లేన్, అశోక్‌ నగర్‌, విజయవాడ – 520010

ఫోన్‌ : 9866115655

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here