[dropcap]అం[/dropcap]దరికీ ఆహ్వానం
శ్రీ గుడిమెట్ల చెన్నయ్య రచించిన “మనిషి కనబడుట లేదు” కవితా సంపుటి ఆవిష్కరణ సభ తెలుగుశాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం, రజతోత్సవ ప్రాంగణం, చెన్నై-00 005 వేదికపై 6.3.2019, బుధవారం, మధ్యాహ్నం 2.30 గంటలకు జరుగుతుంది.
సభకు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ అధ్యక్షత వహిస్తారు.
డాక్టర్ నిర్మలా పళినివేలు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.
వేద విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి శ్రీ కందనూరు మధు ప్రథమ ప్రతిని స్వీకరిస్తారు.
కవి, విమర్శకులు డాక్టర్ కాసల నాగభూషణం కవితా వ్యాఖ్యానం చేస్తారు.
శ్రీ గుడిమెట్ల చెన్నయ్య తమ ప్రతిస్పందన తెలియజేస్తారు.