[dropcap]మ[/dropcap]నసు మౌనం
కాదిది శూన్యం
ఎనలేని కాంతి
అందిన ఆర్తి
నిండిన మానసం
పొందిన సంతసం
కన్నుల వర్షం
అది మది హర్షం
లయ తప్పిన యద
ఇల సదృశమైనదా
ఉప్పొంగిన ఉద్వేగం
అందించెను అంతరంగం
లేదిక దైన్యం
రాదిక దాస్యం
నమ్మలేని నమ్మిక
ఉంటుంది కడదాక
బ్రతుకు పైన ఆశ
నీవిచ్చిన శ్వాస
నిర్వచనమెరుగని ప్రేమా
నను పలకరించినావమ్మా…..