-
తాజమహల్
ఏ కవికి అందనివి దాని హొయలు
శిల్పుల కన్నీళ్ల చలువరాళ్లు. -
నయాగరా
విశ్వసుందరి నవ్వుల గలగల
భళా! సౌందర్యలహరి. -
దీపం
ఎంతైనా చెప్పలేం దాని ధైర్యం
ఎంత చీకటినైనా తరిమి కొడుతుంది. -
నగరం
ప్రతిరోజూ అక్కడ పరుగు పందెం
ఓడి పోయేవాళ్లు ఎంతమందో ! -
వేమన
తన పేరులో కులాన్ని ఖండించాడు
కుళ్ళిన సమాజాన్ని దండించాడు.