[dropcap]రా[/dropcap]లిపోయే ఆకుకు ఆశలెందుకు
పూసే పూవుకు పూజే ఫలం
పుట్టే శిశువుకు పుట్టుకతోనే
శ్రమ ప్రారంభం
కాలు చేతులు కదపడం
పొట్ట నింపుకోవడానికి చేసే తొలి ప్రయత్నం
ప్రకృతి నేర్పే పాఠం
శిశువులు పుడుతున్నారు
కొందరు పిల్లలు పెకిలించబడుతున్నారు
సిజేరియన్ ద్వారా
సహజంగా సాగవలసినది
ప్రకృతి వికృతిగా
వైద్యో నారాయణో హరి
ధనాపేక్షలేని వైద్యులే నారాయణులు
వారికి మన జోహార్లు