పర్యావరణ కథలు -4: చీకటి లోని అందాలు

0
4

[box type=’note’ fontsize=’16’] పర్యావరణం కథలలో భాగంగా, ‘చీకటి లోని అందాలు‘ అనే కథలో కృత్రిమ వెలుగులు పర్యావరణానికి చేస్తున్న హాని గురించి బాలబాలికలకి సరళమైన కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]

[dropcap]మ[/dropcap]హానగరంలో ఉండే నిశికాంత్ మూడు రోజుల జాతర చూడటానికి కుటుంబ సభ్యులతో కలసి తాతగారి స్వగ్రామం అయిన ఒకానొక కుగ్రామం అటవీ ప్రాంతానికి వచ్చాడు.

తనకి పట్టణ ప్రాంతం వదలి గ్రామంకి రావటం ఇష్టంలేదు. కానీ తప్పలేదు.

అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు. సో స్మార్ట్ ఫోన్ ఓన్లీ ఫోన్ అయ్యింది. పైగా సిగ్నల్ సమస్య. ఫ్రెండ్స్ తో చిట్ చాట్ వీలు కావటం లేదు. గుడారాల్లాంటి చిన్ని ఇల్లు. పైగా అనుకోని పవర్ కట్ సమస్య. ఎసి అలవాటు అయిన నిశికాంత్‌కి చాల ఇబ్బందిగా ఉంది. అమ్మా నాన్న, తాత నానమ్మ, ఇతరులు చాల హాయిగా ఎలా ఉంటున్నారో అర్థం కావటంలేదు.

అటవీ ప్రాంతం కావటంతో నీడ వల్ల వేడి తక్కువగా ఉంది. అయినా ఫాన్స్ ఉన్నా సరిపోవటం లేదు.

మొదటి రోజు పూజ తరువాత అందరు తమ పురాతన ఇంట్లో బస చేసారు. అందరికి మంచి నిద్ర పట్టింది, నిశికాంత్‌కు తప్ప. పరిసరాలు, సౌకర్యాలు నచ్చకపోటం కారణం.

మగవాళ్ళంతా ఆరు బయట మంచాలు వేసుకుని పడుకున్నారు. నల్లని ఆకాశం, చిమ్మ చీకటి, కీటకాల అరుపులు, గాలికి కదిలే ఆకుల గలగలలు భయాన్ని కలిగించాయి. టీవీలో చూసిన హార్రర్ సినిమాలు గుర్తుకువచ్చాయి.

“దేవుడా! దేవుడా!” అని అనుకుంటూ నిద్ర పోవటానికి ట్రై చేసాడు. “వెధవ చీకటి, చెత్త ఊరు” అని తిట్టుకున్నాడు.

ఇంతలో తన దగ్గరగా ఎవరో ఉన్నట్లు అనిపించి మామ కాబోలు అనుకుంటూ ముఖం మీదనుండి దుప్పటి తీసి చూసాడు. ఏముంది? గుండె ఆగినంత అయ్యింది. ఎవరో తెలుసా? ఒక నల్లని నీడ.

భయంతో కెవ్వుమన్న అరుపు బైటకి రాలేదు.

“భయపడకు నిశికాంత్. నేనున్నాను” అంది నీడ.

‘నీవల్లే భయం’ అనుకున్నాడు నిశికాంత్ మనస్సులో.

“నేను చీకటిని” అంది నీడ.

“చీకటి! ఎవరు? ఎక్కడ?” అన్నాడు.

“నిశికాంత్ భయపడకు. నేను ప్రకృతిలో భాగం అయిన చీకటిని, రాత్రిని” అంది నీడ.

“నైట్. డార్క్ నైట్!” అన్నాడు నిశికాంత్.

“అవును.”

“ఎందుకు వచ్చావు?” అన్నాడు కొంచం ధైర్యంతో. సెల్ లోని టార్చ్ వెయ్యాలని ట్రై చేసాడు.

“వద్దు. ఆగు. కృత్రిమ వెలుగు వద్దు” అని ఆపింది నీడ.

“కృత్రిమ వెలుగు! అదేంటి?” అన్నాడు నిశికాంత్.

“తెలీదా? మీరు తయారు చేసే విద్యుత్ వెలుగులన్నీ ఆర్టిఫిషల్. నేచర్ గిఫ్ట్ చేసిన లైట్ సూర్యుడి కాంతి. చంద్రుని వెన్నెల వెలుగు” అంది నీడ.

“అంతేకాదు మీ పట్టణ కాంతి కాలుష్యాన్ని ఇక్కడ తేవద్దు” అంది కోపంగా నీడ.

“కాంతి కాలుష్యం? ఐ నెవెర్ హెర్డ్ అబౌట్ ఇట్” అన్నాడు నిశికాంత్ ఆశ్చర్యంగా.

“అవునా? విను. లైట్ పొల్యూషన్ గురించి చెబుతాను” అంది నీడ.

“నిశికాంత్, నేను చెప్పేది వింటూ చీకటిలో ఆకాశాన్ని చూడు. కాంతిని వెదజల్లేవి ముఖ్యంగా సూర్యుని వెలుగు. అన్ని జీవరాశులకు అవసరమైనది. ఇట్స్ సో ఇంపార్టెంట్ ఫర్ ఆల్ లివింగ్ బీయింగ్స్. అంతేకాదు నక్షత్రాలు, పాల పుంతలు, గెలాక్సీస్, చంద్రుడు వెలుగు సహజసిద్ధమైనవి. ఆర్టిఫిషియల్‌గా మీరు తయారుచేసినవి విద్యుత్ వెలుగులు, విద్యుత్ లోని రకాలు నీకు తెలుసా?” అంది నీడ.

“తెలుసు. థర్మల్ / బొగ్గుతో, హైడల్/నీటితో, సోలార్/సూర్యుని, ఇంకా battery తో.”

“గుడ్. నువ్వు చెప్పిన వాటిలో ఒక్క సోలార్, బాటరీ తప్ప మిగతావి పర్యావరణానికి మంచివి కాదు.”

“ఆర్టిఫిషియల్ లైట్, లైట్ పొల్యూషన్‌కి కారణమా?”

“అవును”అంది చీకటి.

“ఎలా? హౌ?”

“డిటైల్డ్‌గా చెబుతా. లైట్/వెలుగు మనకి వస్తువులు మరింత స్పష్టంగా కనిపించేలా చేస్తుంది.”

’అవును చీకటిలో నాకు నువ్వు తప్ప ఇంకేమి కనపడటంలేదు.”

చీకటి నవ్వింది. “విను. డిస్టర్బ్ చెయ్యకు. అందరు నిద్ర లేస్తారు.”

“సరే! సరే!”

“లైట్ పొల్యూషన్ /కాలుష్యాన్ని ఫోటో పొల్యూషన్ అని కూడా అంటారు. అవసరానికి మించి యూజ్ చేసే లైట్ వల్ల రాత్రికే కాదు మీకు అనేక ఇబ్బందులున్నాయి. అతి లైట్ వాడకం వల్ల మీకు రాత్రిలో ఆకాశంలో కనిపించే అద్భుతమైన పాలపుంతలు, స్టార్స్, మూన్ ఇతర సెలెస్టియల్/ఖగోళ వింతలూ, ప్లానెట్స్/గ్రహాలు, చీకటిలో అందాలు కనిపించవు. నీకు తెలీదు కదూ? ఇంటర్నేషనల్ డార్క్ స్కై అసోసియేషన్‌కి చెందిన రాబర్ట్ జెంట్ – ‘నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు రాత్రి పూట స్కై వాచ్ (ఆకాశ వీక్షణం) అంటే ఆకాశం వైపు చూడటం చాల ఇష్టము. నాకింకా గుర్తు ఆకాశం వైపు చూస్తూ నక్షత్రాలని లెక్కపెట్టటానికి ప్రయత్నించేవాడిని. ఒక్కోసారి నేల మీదకు రాలిపడుతున్నట్లు రాలే celestial debris లని, నక్షత్రాలను, పోల్ స్టార్స్, నక్షత్ర మండలాలని చూస్తూ వాటికి అవతల other side of them ఏముందని curiosity తో తెలుసుకోవాలనే ప్రయత్నంలో నేనొక ఆస్ట్రోనామర్ (వ్యోమగామి) అయ్యాను. చీకటిలో ఆకాశపు అందాలకు లొంగిపొయ్యాను’ అని అన్నారు. ఇప్పటి పిల్లలు స్కై వాచింగ్‌కి దూరమవడం విచారకరం. ముఖ్యంగా నీలాంటి సిటీ పిల్లలు” అంది చీకటి.

“నిశికాంత్, సాధారణంగా మీ కంటికి ఎలాంటి instruments /పరికరాలు లేకుండా 2500 నక్షత్రాలను చూడవచ్చు. కానీ లైట్ పొల్యూషన్ వల్ల కేవలం 200 – 300 స్టార్స్ మాత్రమే చూడగలం ఊర్లలో… అదే మీ సిటీ లాంటి చోట ఓన్లీ కొన్ని dozens stars కనిపిస్తాయి” అంది చీకటి బాధగా.

“అవును. Hardly we see any stars in my apartments” అన్నాడు నిశికాంత్.

“మీ సిటీస్‍లో పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం వాడే విద్యుత్ వెలుగుల వల్ల రాత్రికి అర్థం లేదు. కానీ ఆకాశాన్ని అంటే భవనాలు, malls /వాణిజ్య భవనాలు, అలంకరణ లైట్స్, హోర్డింగ్స్ ఇతర వెలుగుల కారకాలకు దూరంగా, తక్కువగా వాడే పల్లెల్లో ఇంకా కొంచం చీకటి అందాలు చూస్తున్నారు నీలాటి పిల్లలు. వెలుగు/కాంతి కాలుష్యం మిమ్మల్నే కాదు జంతువులూ, పక్షులు, కీటకాలను కూడా ఇబ్బంది పెడుతుంది. నువ్వు ఎప్పుడైనా మీ సిటీలో రాత్రి అరిచే కీచురాయి అరుపు విన్నావా? మిణుగురు పురుగులు అదే fire flies చూసావా? లేదు. అలంటి ఎన్నో కీటకాలు కన్పడకుండా పోతున్నాయి. వలస పక్షులు రాత్రి దారి తెలీక గాలిలో తిరిగి తిరిగి అలసిపోయి నేల రాలుతున్నాయి. మీ వెలుతురూ వాటిని తికమక చేస్తున్నది. సముద్రపు తాబేళ్లకు రాత్రి చీకటి బీచ్‌లు కావాలి గుడ్లు పెట్టి పొడగటానికి. కానీ చాల చోట్ల వీలుకాక అవి చనిపోతున్నాయి. పాపం!” అంది.

“అయ్యో! so sad” అన్నాడు నిశికాంత్.

“మితిమీరిన కృత్రిమ లైట్ వాడకం వాళ్ళ మీ ఆరోగ్యానికి మంచిదికాదు.”

“అదెలా?”

“చీకటి బదులుగా రాత్రిపూట వెలిగే లైటింగ్ వల్ల నిద్ర సరిగాపట్టక అలసట, అనారోగ్యం కలగవచ్చు. ఎక్కువ వెలుగు కళ్లకు హాని చేస్తాయి. చూపు తగ్గవచ్చు. తలనొప్పులు రావచ్చు. తక్కువ వెలుగులో కూడా చూడగలిగే శక్తి కళ్ళకి తగ్గిపోవచ్చు. చెట్ల ఎదుగుదలకు కూడా ఇబ్బందే. అంటే కాదు కాంతి కాలుష్యం వాళ్ళ ఖగోళ శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగాలు చేసి కొత్త విషయాలను కనుక్కోవడానికి ఇబ్బంది అవుతున్నది.”

“చీకటీ, నీకు కాంతి కాలుష్యం గురించి ఎవరు చెప్పారు? ఎలా తెలుసు?” అని అడిగాడు నిశికాంత్.

నవ్వినా చీకటి కంటిన్యూ చేసింది చెప్పటం.

“1964లో ఫస్ట్ టైం లైట్ పొల్యూషన్ గురించి ప్రపంచనికి తెలిసింది. జూన్ 2న 2002 చెక్ రిపబ్లిక్ ఫస్ట్ టైం లైట్ పొల్యూషన్ కంట్రోల్ చెయ్యటానికి చట్టం చేసింది. దానివల్ల ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, ప్రజలకు తెలిసింది. లైట్ పొల్యూషన్‌లో రకాలో తెలుసా? sky glow మిమ్మల్ని స్కై లో ఉండే వాటిని కనపడకుండా చేస్తుంది, స్టార్స్ లాంటివి. light trespass మీరు వాడే లైట్ ఇతర చోట్లకు ప్రసరించటం. ఉదాహరణకు స్కై మీదకు, లైట్ glare మిరుమిట్లు గొలిపే వెలుగు చూపుని అడ్డగిస్తుంది. నైట్ డ్రైవింగ్‍లో ఎదురుగా వచ్చే వాహనాల హై బీమ్ లైట్ లాంటివి.”

“చీకటీ! లైట్ పొల్యూషన్‌ని ఆపటానికి, తగ్గించటానికి మేము ఏమి చెయ్యలేమా?”

“చెయ్యవచ్చు. వ్యక్తిగతంగా మీరందరు పొల్యూషన్‌ని తగ్గించటానికి ట్రై చెయ్యాలి. అవసరం లేకుండా లైట్స్ ఆన్ చెయ్యవద్దు. స్ట్రీట్ లైట్స్, కమర్షియల్ లైట్స్ వెలుగు స్కై వైపు కాకుండా గ్రౌండ్ మీదకు పడితే మంచిది. ఇంట్లో విండో కర్టైన్స్ వాడాలి. కృత్రిమ వెలుగు బదులు సోలార్ లైటింగ్ వాడాలి. మీరు వాడే లైటింగ్ విద్యుత్ తయారీ పర్యావరణానికి చాల హాని చేస్తున్నది. ముఖ్యంగా థర్మల్/బొగ్గు ఆధారిత మరియు జల/హైడల్ విద్యుత్. నిశికాంత్, నేను చెప్పింది విన్నావుగా అర్థం చేసుకో! ఫ్యూచర్ మీదే. భాధ్యత మీదే.”

చీకటి మాటలు వింటున్న నిశికాంత్ కళ్ళు నెమ్మదిగా darkness కి అలవాటుపడి నక్షత్రాలు, చంద్రుడు, మిల్కీ వే వెలుగును చూసాడు.  అంతే కాదు ఎన్నడూ చూడని మసక వెలుతురు లోని అందాలు ఆనందాన్ని ఇచ్చాయి. చీకటి అంటే భయం లేదని, చీకటిలో అందాలున్నాయని తెలుకున్న నిశికాంత్ హ్యాపీగా, క్యూరియస్‌గా ఫీల్ అవుతున్నాడు. ఇంతలో ‘నీకు అనుభవం లేని అరుణోదయం(sun rise) లోని ప్రకృతి అందాలు చూపిస్తాను’ అన్నట్లుగా సూర్యుడు ఆకాశాన్ని చీల్చుకు వస్తున్నట్లుగా పైకి వస్తూ కనిపించాడు.

నిశికాంత్ ఆనందం, ఆశ్చర్యంతో చప్పట్లు కొడుతూ “thank you dark night” అన్నాడు.

“నిశీ! నిశీ! బేటా! వాట్ హాప్పెన్డ్?” అనే తాత పిలుపుకు ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు నిశికాంత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here