[dropcap]ప్రే[/dropcap]మించడం ఎలానో
నాకెందుకు నేర్పావూ?
ఆ ప్రేమను పొందడం ఎలానో కూడా
నేర్పాలి గదా మరీ.
నువ్వు చెప్పిన పాఠమే
ప్రశ్నగా మారితే –
ఏ దారీ తెలీని
బాటసారినైనా
గమ్యమే తెలియని
గమనాన్నైనా.
ఎన్ని ఎత్తుపల్లాలో
ఎన్ని ఎదురుదెబ్బలో –
అయినా
ప్రేమ దక్కదు
పయనమాగదు.
మళ్ళీ మరోసారి
ప్రేమించడం నేర్పుతావని
నీ కోసం –
వెతుకుతూనే వున్నా…
విరహమై నేనున్నా.