[dropcap]ప్ర[/dropcap]జాస్వామ్యంలో ఓట్లు
నాయకులకు పాట్లు
కడతారు ఓటుకు రేట్లు
ప్రజలకు వేస్తారు కాట్లు
వస్తారు కారులో
తిరుగుతారు వీధిలో
వాగ్దానాలు కూడలిలో
మరిచిపోతారు గెలుపులో
అంతా నేనే అంటాడు
పనులు చేస్తామంటాడు
వెంటే తిప్పుకుంటాడు
నిన్ను మరచి ఉంటాడు
ప్రజలే మా దేవుళ్ళు
మీకే మా దండాలు
పెడుతారు మన నాయకులు
చూపిస్తారు తరువాత నరకాలు
ఓట్లరను కొంటారు
సారాయి పోస్తారు
ప్రలోభాలు పెడతారు
అభివృద్ధి మరుస్తారు
కులాల మతాల ఓట్ల కోసం
సంఘాల మెప్పు కోసం
నాయకుల గెలుపుకోసం
ఏమీ చేయరు ప్రజల కోసం
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి
నాయకులు మారాలి
దేశం వృద్ధి చెందాలి
ప్రజలు చైతన్యం కావాలి