[dropcap]చె[/dropcap]దరకుండ ఉంటుందా ఏదైనా స్వప్నం
కదలకుండ ఉంటుందా మనిషి బ్రతుకు చక్రం.
ఎక్కడా ఆగదులే పరిగెత్తే కాలం
కాలజ్ఞానం చదివితే మనిషి బ్రతుకు భద్రం.
చిన్ననాటి జ్ఞాపకాలు కాగితాల పడవలు
ఎదురీతతో నిలుస్తుంది మనిషి బ్రతుకు చిత్రం.
మాట వినని మనసేమో ఎటో వెళ్లి పోతుంది
కరగకుండ ఉంటుందా మనిషి బ్రతుకు నిత్యం.
పైట కొంగు పరువానికి ప్రాణ స్నేహమే ‘శ్రీయా’
పెనుగాలిని చూడకుంటె మనిషి బ్రతుకు చిద్రం.