[box type=’note’ fontsize=’16’] పర్యావరణం కథలలో భాగంగా, ‘ఎయిర్ క్వాలిటీ’ అనే కథలో గాలి ఎలా కలుషితమవుతోందో, వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి ఏం చేయాలో వివరిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]
[dropcap]హ[/dropcap]రిణికి కొద్దీ రోజులుగా దగ్గు జ్వరంగా ఉంది. స్కూల్ కి వెళ్లలేకపోతున్నది. ఇంకోసారి డాక్టర్ దగ్గరకు వెళ్లారు.
హరిణి టర్న్ కోసం ఎదురుచూస్తూ క్లినిక్‌లో వెయిట్ చేస్తున్నారు. తనలాగే దగ్గుతున్న కిడ్స్ కనిపించారు. అమ్మ ఎవరో ఆంటీతో మాట్లాడుతోంది. దిక్కులు చూస్తున్న హారిణికి ప్రక్కనే ఎవరో ఉన్నట్లు అనిపించి తలతిప్పి చూస్తే తన వయస్సు ఉన్న ఒక అబ్బాయి కనిపించాడు. ఇద్దరు పలకరింపులా నవ్వారు.
ఇంతలో “హరిణి!” అని నర్స్ పిలుపుకి అమ్మతో పాటుగా లోపలికి డాక్టర్ దగ్గరకు వెళ్లారు. హరిణిని చూసిన డాక్టర్ అంకుల్ ‘ఎయిర్ పొల్యూషన్ (గాలి కాలుష్యం) మూలంగా దగ్గు, జ్వరం వచ్చాయ’ని చెప్పి మందులు ఇచ్చారు. డాక్టర్ రూమ్‍లోనుండి బయటకువచ్చిన హారిణికి ఆ అబ్బాయి కనపడలేదు.
సాయంత్రం బెడ్ రూమ్ బాల్కనీలో కూర్చున్న హారిణికి ఒక నల్లని మేఘం లాంటి గాలి తన దగ్గరకు వచ్చినట్లు అనిపించి బెదిరింది. ఆ గాలిలో ఏదో తెలీని వాసన. లోపలి వెళ్లిన హారిణితో పాటే ఆ గాలి కూడా రావటానికి ట్రై చేస్తుంటే, హరిణి విండో క్లోజ్ చెయ్యబోయింది.
“హరిణి! ప్లీజ్! ఆగు. నన్ను లోపలి రాని. లెట్ మీ ఇన్” అంది ఆ గాలి.
“నో. యు అర్ స్మెల్లింగ్ బాడ్. ఏదో చెడు వాసన. అవును నువ్వెవరు?” అంది.
“నేను గాలిని. ఎయిర్‌ని.”
“ఎయిర్ అయితే ఫ్రెష్‌గా ఉండాలి కదా? బట్ ఏదో వాసన” అంది హరిణి.
“హరిణి! నన్ను లోపలి రానిస్తే ఫ్రెష్/క్లీన్ ఎయిర్ అయిన నేను ఎలా వాసనగా కలుషితం అయ్యానో చెబుతా. ప్లీజ్” అంది గాలి.
“ఓకే. కం ఇన్.”
“హరిణి!” అన్న అమ్మ పిలుపుకి “అమ్మా! ఏంటి?” అంది
“విండోస్ క్లోజ్ చెయ్యి. ఎయిర్ క్వాలిటీ బాడ్‌గా ఉంది. ఎయిర్ ప్యూరీఫైర్ ఆన్ చెయ్యి” అంది అమ్మ.
“అలాగే” అని అమ్మ చెప్పినట్లు చేసింది హరిణి.
“ఆ! ఏదో చెబుతానన్నావుగా చెప్పు” అంది హరిణి గాలితో.
“కళ్ళు మూసుకుని విను. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్” అంది గాలి.
“పిల్లలకు పెద్దలకు ఫ్రెండ్ లాంటి నన్ను మీకు శత్రువుగా ఎవరు ఎలా చేసారో చెబుతాను. దిస్ ఈజ్ మై సాడ్ స్టోరీ. హరిణి మనిషి, మరియు భూమి మీద బ్రతికే ప్రతి ప్రాణి, చెట్లు, జంతువులూ, చేపలు లాంటి అన్నింటి జీవిత కాలం ఐ మీన్ లైఫ్ స్పాన్‌ని తగ్గించి త్వరగా నశించిపోయే అంటే రోగాలు వచ్చేలా చేసేవాటిలో మొదటిది వాయు కాలుష్యం… పొల్యూటెడ్ ఎయిర్ అని తెలుసా?” అంది గాలి.
“అవునా? నువ్వు, డాక్టర్ చెబితే విన్నాను. బట్ అర్థం కాలేదు” అంది హరిణి.
“నీకు అర్థం అవుతుంది. కళ్ళు తెరిచి చూడు” అంది గాలి.
కళ్ళు తెరిచిన హారిణికి తాను ఎక్కడుంది తెలీలేదు. గాలిలో తేలుతున్నది.
“హరిణి భయపడకు. నేనున్నాను. రా నీకు అర్థం అయ్యేలా చెబుతాను. ఫాలో మీ” అంది గాలి.
గాలిలో ఏదో తెలియని కెమికల్ వాసన. క్రిందకి చూస్తే ఫ్యాక్టరీ పైప్స్ నుండి గాలిలోకి కలుస్తున్న పొగ.
“ఎయిర్! అదేంటి? ఆ పొగ నీలో కలుస్తోంది?” అడిగింది హరిణి
“హరిణి! మీరు పీల్చే గాలిలో ఎన్నో చెడు వాసనలు, పొగలు, కెమికల్స్ ఉన్నాయి.”
“అదెలా?”
“నువ్వు చూసావు కదా, మీ ఫ్యాక్టరీస్ గాలిలోకి వదిలే కెమికల్స్ పొగ రూపంలో శుభ్రమైన గాలిలో చేరిపోతాయి. ఎయిర్ పొల్యూషన్ లైఫ్స్ స్పాన్‌ని/జీవిత కాలాన్ని తగ్గిస్తుందన్నానుగా. ఇంకా చెబుతా విను. ఎయిర్ క్వాలిటీ, మీరు ఉండే ప్రదేశం/సిటీ, కాలుష్యానికి కారణమైన పొగను వదిలే వాటిని బట్టి మీ లైఫ్ స్పాన్ ఎంత తగ్గిపోతుందో మీ సైంటిస్ట్స్ ప్రెడిక్ట్ చేస్తున్నారు. తెలుసా?”
“అవునా? ఎలా?”
“ప్రస్తుతపు కొన్ని అంచనాల ప్రకారం ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ రోజు రోజుకి పెరగటంతో ఆయుష్…
“అంటే?” అంది హరిణి.
“అదే లైఫ్ 11 ఏళ్ళు తగ్గిపోతున్నదిట. పొగ, ధూళి, ఎక్కువగా ఉన్న చైనాలో 7 ఏళ్ళు, అమెరికాలో కొన్ని సిటీల్లో 1 ఏడాది తగ్గుతోందిట. ఎయిర్ పొల్యూషన్ ఇలాగే పెరిగిపోతుంటే వరల్డ్ మొత్తం ప్రజలు అనేక విధాలుగా జీవిత కాలాన్ని నష్టపోతారు.”
“అవునా. పాపం” విచారంగా అంది హరిణి.
“అవును. పాపమే. మీ సెల్ఫిష్ మనుషులు చేస్తున్న పాపం. బిగ్ సిన్” అంది ఎయిర్ కోపంగా.
అంతలోనే కోపం తగ్గించుకుని కూల్‌గా చెప్పటం కంటిన్యూ చేసింది
“మీకు అన్నింటికన్నా డేంజర్ వెరీ స్మాల్ డస్ట్ పార్టికల్స్ (చిన్న ధూళి కణాలు). వాటిని పి.ఎం 2.5 అంటారు. డస్ట్ పార్టికల్స్ ఎయిర్ లోకి బొగ్గు, పెట్రోల్, డిజిల్ లాంటివి వాడి బర్న్ చేయటంవల్ల వస్తున్నాయి.”
“రియల్లీ?”
“అవును. పొగతాగటం వల్ల…” అని గాలి చెబుతుండగానే…
“అంటే? పొగ ఎలా తాగుతారు?” అంది హరిణి.
“సారీ. సిగరెట్ స్మోక్ వల్ల ప్రపంచంలో సగటు జీవనకాలం (యావరేజ్ లైఫ్) 1.6 ఏళ్ళు తగ్గితే, ఎయిర్ పొల్యూషన్ (వాయు కాలుష్యం) 1.8 ఏళ్ళు తగ్గిస్తోందిట” అంది ఎయిర్.
“మై ఫ్రెండ్ ఎయిర్! పి.ఎం.2.5 డస్ట్ పార్టికల్స్ పీలిస్తే ఏమవుతుంది?”
“నాకు తెలిసి మీరు సిక్ అవుతారు. సైంటిస్ట్స్ /డాక్టర్స్ లెక్క ప్రకారం మీరు గాలి ద్వారా పీల్చే ధూళి కణాలు పిఎం 2.5 పార్టికల్స్… లంగ్స్ లోకి, బ్లడ్ లోంచి బ్రెయిన్లోకి, బాడీ మొత్తంలోకి వెళ్ళిపోతాయి” చెప్పింది గాలి.
“ఆమ్మో!” అంది హరిణి భయంగా.
“తరువాత తరువాత మీకు రకరకాల జబ్బులు వస్తాయి.”
“అంటే డాక్టర్ చెప్పినట్లు నాకు వచ్చిన ఫీవర్, దగ్గు. అవునా?” అంది హరిణి
అవును. అంతే కాదు, శ్వాస జబ్బులు, ఆస్తమా, దగ్గు, ఊపిరి ఆడకపోవడం, తల నొప్పులు, కళ్ళు నీరు కారటం ఇంకా కాన్సర్, గుండె జబ్బులు లాంటివి రావచ్చు” అంది గాలి.
“అవును, ఎయిర్ క్వాలిటీ బాలేదని అమ్మకు ఎలా తెలుసు?”
“బహుశా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఫోన్‌లో చూసి ఉంటుంది” అని చెప్పి, “హరిణి క్వాలిటీ ఇండెక్స్ తెలుసా?” అని అడిగింది గాలి.
“లేదు. నో. నీకు తెలుసా?”
“తెలుసు. నా హెల్త్ గంట గంటకు ఎలా మారిపోతున్నాదో/ఎలా పాడవుతున్నాదో తెలుకోవాలిగా” విచారంగా అంది ఎయిర్.
“ఐ యామ్ సిక్. విను. గాలిలో వచ్చిచేరే ధూళి కణాలు అదే పీఎం పార్టికల్స్‌ని బట్టి నా హెల్త్ తెలుస్తుంది. ఇండెక్స్‌లో గాలి గ్రీన్‌గా ఉంటే గుడ్, యల్లో పర్లేదు మోడరేట్, ఆరెంజ్ రంగులో ఉంటే నాట్ సేఫ్ ఫర్ చిల్డ్రన్- పిల్లలకి మంచిది కాదు. రెడ్ కలర్ పూర్, పర్పుల్ వెరీ పూర్, మెరూన్ అత్యంత ప్రమాదం అని తెలుస్తుంది.”
“మై ఫ్రెండ్ ఎయిర్, ఎయిర్ పొల్యూషన్‌లో ఓన్లీ ఎయిర్ పాడవుతుందా?”
“నో. హరిణి. పొల్యూటెడ్ ఎయిర్ ఉన్నచోట వానలు కురిస్తే గాలిలో ఉన్న ధూళి కణాలు వాన నీటిలోకి వచ్చి భూమి మీదనున్న చెరువులు, నదులు, గ్రౌండ్ వాటర్‌ని పాడుచేస్తాయి. నీటి వల్ల జంతువులూ, మొక్కలు, పంటలు చెరువుల్లోని చేపల్లాంటివి కూడా కలుషితం అవుతాయి. ఆ వాటర్ తాగితే సిక్ అవుతారు.”
“మరి ధూళి కణాలు గాలిలో కలవకుండా ఆపటం ఎలా?” అంది హరిణి.
“అటు చూడు హరిణి, పంట వ్యర్ధాలను కాలుస్తున్నారు. పొగ ఎలా నాలో కలిసి నన్ను నిన్ను సిక్ చేస్తున్నది. హరిణి! అటు చూడు. పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ జాం అయింది. అందరు హారన్లు కొడుతున్నారు. చుట్టూ పొగ. వెహికల్ ఎమిషన్స్. వ్యర్ధాలు. పొగ కూడా పైకి వచ్చి నాలో కలుస్తోంది. అటు చూడు. అటు. అక్కడ పంట పొలాల్లో కలుపు మందులు, రసాయన ఎరువులు వాడుతున్నారు. ఓహ్ నో. వాటి ధూళి కూడా ఇక్కడకు వస్తోంది. హరిణి వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు…”
“అంటే, అర్థం కాలేదు” అంది హరిణి.
“అంటే నాచురల్ డిజాస్టర్స్, తుఫాన్, volcanic dust లాంటివి కూడా. హరిణి ఎయిర్ పొల్యూషన్‌కి పర్యాయ పదం smog ని మొదటగా వాడింది లండన్ నగరం” చెప్పింది గాలి.
అలా మాటల్లో చాల దూరం వచ్చారు. ఇంతలో హారిణికి గాలి చాలా హాయిగా మంచి సువాసనతో క్లీన్‌గా, ఫ్రెష్‌గా అనిపించింది. క్రిందకు చూస్తే పచ్చని దట్టమైన అడవులు. రకరకాల చెట్లు, జలపాతాలు, జంతువులు, ఎగురుతున్న సీతాకోకచిలుకలు కనిపించాయి.
“wow. great.”
“అవును. మీరు ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలంటే ఇలాంటి పెద్ద అడవులు పెంచాలి. అయినా మీ స్వార్థపరులు అడవులు కట్ చెయ్యటాన్ని ఎంజాయ్ చేస్తారు.”
“సారీ. సారీ” అంది హరిణి. “ఇంకా ఏమి చేస్తే పొల్యూషన్ తగ్గుతుంది?” అడిగింది.
“గో గ్రీన్. కెమికల్స్ వాడకం తగ్గించండి. 30 ఏళ్ళ క్రితం ఇంత వాడకం లేదు. ఆఖరికి నువ్వు వాడే సబ్బులు, షాంపూలు కూడా పొల్యూట్ చేస్తున్నాయి ఎయిర్, వాటర్‌లని. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, సైకిల్స్ ఉపయోగించాలి. చిన్నప్పుడు మీ అమ్మ నాన్న లా. టైర్స్ లాంటివి, ప్లాస్టిక్ తగల పెట్టొద్దు. cross ventilation ఉండాలి ఇంటిలో” అంది గాలి
“అంటే?”
“అంటే windows ఓపెన్‌గా ఉంచితే గాలి ఎంట్రీ, ఎగ్జిట్‌కి వీలవుతుంది.”
“మరి అమ్మ windows ఓపెన్ చేస్తే బాడ్ ఎయిర్, దోమలు వస్తాయంది.”
“నిజమే. బట్ వచ్చిన ఎయిర్ లోపలే ఉంటే ఎలా? హరిణి indoor polution గురించి నీకు తెలుసా?”
“లేదు. అంటే?”
“ఇంటి లోపల కూడా చాల కాలుష్యం, ధూళి కణాలు పేరుకుపోయి ఉంటాయి. కొన్నిసార్లు బయటి ఎయిర్ పొల్యూషన్ కంటే లోపలి ఎయిర్ బాడ్‌గా ఉండవచ్చు. indoor polution types – కుకింగ్, ఇతర స్మోక్. మీరు spay చేసుకునే perfumes లాంటివి.. దోమల స్ప్రే. బయో పొల్యూషన్, పూల పుప్పొడి. పెంపుడు జంతువుల జుట్టు లాంటివి; randon గ్యాస్, మీ బిల్డింగ్ basementsలో trap అయిన గ్యాస్, చలి మంటల నుండి వచ్చే పొగ లాంటివి కిటికీలు మూసిపెడితే బైటకి పోలేక లోపలే ఉండిపోయి మిమ్మల్ని సిక్ చేస్తాయట.”
“అవునా. అమ్మకి చెబుతాను” అంది హరిణి.
హరిణికి అడవుల నుండి వస్తున్న క్లీన్ ఎయిర్ పీల్చటంతో ఎంతో హాయిగా అనిపించింది. దగ్గు తగ్గింది. తనతో పాటు ఉన్న ఎయిర్ స్మెలింగ్ గుడ్ అనుకుంది.
“హరిణి అర్థం అయిందా, నేను ఎలా సిక్ అవుతూ మిమ్మల్ని సిక్ చేస్తున్నానో. ప్లీజ్. నన్ను ఇంకా పొల్యూట్ చెయ్యకండి. చెట్లు పెంచండి. కెమికల్స్ తగ్గించండి. మీ లైఫ్‌తో పాటు నా లైఫ్ తగ్గించకండి” అని గాలి ప్రాధేయపడింది.
హరిణి సమాధానం చెప్పేలోగా “హరిణి కళ్ళు మూసుకో” అంది ఎయిర్.
“హరిణి” అన్న అమ్మ పిలుపుతో కళ్ళు తెరిస్తే బెడ్ రూమ్‍లో ఉన్నదని తెలిసింది.
బెడ్ రూమ్ విండోస్ ఓపెన్ చేసి “బై మై ఫ్రెండ్ ఎయిర్” అని వీడుకోలు చెప్పి అమ్మ దగ్గరకు వెళ్ళింది.