ఏప్రిల్ 2019 సంపాదకీయం

0
3

[dropcap]సం[/dropcap]చిక వెబ్ పత్రిక అనుక్షణం కొత్త పాఠకులను ఆకర్షించాలని, కొత్త రచయితలకు ఉత్సాహప్రోత్సాహాలివ్వాలని తపనపడుతుంది. ప్రయత్నిస్తుంది. పాఠకులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా సరికొత్త రచనలు, విభిన్నము, విశిష్టము అయినవి అందిస్తోంది. ఇ.ఎన్.వి. రవి రచించిన ‘భాసుని పంచరాత్రమ్’, యన్.వి.యస్.యస్. ప్రకాశరావు రచించిన ‘హాకీ దిగ్గజం రఘువీర్ సింగ్ భోలా’ పరిచయ వ్యాసం, వంటి వ్యాసాలతో పాటూ కథలు కవితలు సమీక్షలు, వ్యాసాలు అందిస్తోంది సంచిక. వీలయినంతవరకూ ప్రతి ఒక్కరికీ కావలసినదొక్కటైనా అందించటంవల్ల అన్ని వర్గాల, వయసుల పాఠకులను ఆకర్షించాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో కొత్త కొత్త పాఠకులను ఆకర్షించాల్సిన అవసరం ఎంత వుందో, యువ రచయితలను తయారుచేసి వారితో రాయించాల్సిన అవసరం అంతకన్నా ఎక్కువే వుంది. అందుకే, యువ రచయితలకు, కొత్త రచయితలకు అవకాశాలివ్వటంలో సంచిక ముందుంటుంది.

ఈ ఉగాదికి సంచిక ప్రచురిస్తున్న రెండవ కథల సంకలనం ‘క్రీడాకథ’ విడుదలవుతుంది. ‘దేశభక్తి కథల సంకలనం’ లాగే తెలుగు కథాప్రపంచంలో ఇలాంటి సంకలనం ఇంకొకటి లేదు. ఇంతకాలం సాహిత్యప్రపంచం విస్మరించిన అనేక అంశాల కథలను సంకలనం చేయటం ద్వారా తెలుగు కథకుల వస్తు విస్తృతి, శైలీ వైచిత్రిని వెలుగులోకి తేవాలని, తద్వారా తెలుగుసాహిత్యాన్ని పరిపుష్టం చేయాలన్న సంచిక ఉద్దేశంలో భాగమే సంచిక సంకలనాల ప్రచురణ. ఇందుకు సంచికకు సహకారం అందిస్తున్న సాహితి ప్రచురణకు ధన్యవాదాలు. దేశభక్తి కథలలానే క్రీడాకథలను పాఠకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాము.

సంచిక ఈ నెల తొలి సంచికలో అందిస్తున్న రచనల వివరాలివి.

ప్రత్యేక వ్యాసం: భాసుని పంచరాత్రమ్ – ఇ.ఎన్.వి. రవి​

ప్రకటన:          క్రీడాకథ ప్రీ పబ్లికేషన్ ఆఫర్

ధారావాహికలు:​

ముద్రారాక్షసమ్ – ప్రథమాంకం 2 – ఇంద్రగంటి శ్రీకాంతశర్మ​

నీలమత పురాణం-17- కస్తూరి మురళీకృష్ణ​

తమసోమా జ్యోతిర్గమయ – 9 – గంటి భానుమతి​

అంతరం – 8 – స్వాతీ శ్రీపాద​

రాజకీయ వివాహం-18- ఆనంద్ వేటూరి

మనోమాయా జగత్తు -8- పోడూరి కృష్ణకుమారి

జానేదేవ్ -1 – ముమ్మిడి శ్యామలా రాణి

కాలమ్స్:​

రంగులహేల-13- సెల్లింగ్ పాయింట్స్ – అల్లూరి గౌరీలక్ష్మి​

మనసులో మనసా – 32 – మన్నెం శారద

కాలనీ కబుర్లు-9- ఆనందరావు పట్నాయక్

వ్యాసాలు:​

విశ్వనాథ మార్గము-1 – కోవెల సుప్రసన్నాచార్య

శివతాండవలక్ష్మి – పరిమి శ్రీరామనాథ్​

రఘ్‌బీర్‌సింగ్ భోలా – ఓ హాకీ దిగ్గజం – ఎన్.వి.యస్.యస్. ప్రకాశరావు​

కథలు:​

ఏదో తెలియని బంధమిది – సాయిపద్మ​

మిస్టర్ అండ్ మిసెస్ నీంబూపానీ – మాలాకుమార్​

ప్రశ్నార్థకం – చావా శివకోటి​

వాశిష్ఠము – వైరాగ్యము – జొన్నలగడ్డ సౌదామిని

సమాంతరం-2- డా. చిత్తర్వు మధు​

కవితలు:​

కేరాఫ్ – శ్రీధర్ చౌడారపు​

గజల్-1- శ్రీరామదాసు అమర్‌నాథ్​

వదిలి వెళుతున్నా నేస్తమా – శ్రీదేవి శ్రీపాద

బెదురుచూపుల నీడ – సి.యస్. రాంబాబు

భయం – పిన్నింటి అప్పారావు

భక్తి పర్యటన:

గుంటూరు జిల్లా యాత్ర – 37: గోకర్ణమఠం – పి.యస్.యమ్. లక్ష్మి

భక్తి:

తిరుమలేశుని సన్నిధిలో-7 – డా. రేవూరు అనంతపద్మనాభరావు

బాల సంచిక:​

ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్-7- ఎనుగంటి వేణు గోపాల్

పర్యావరణ కథలు-6: ఎయిర్ క్వాలిటీ – చాముండేశ్వరి

బామ్మగారూ – బుజ్జిదూడలు – దాసరి శివకుమారి​

పుస్తకాలు:​

‘ఇంటింటికొక పూవు’ – పుస్తక పరిచయం ​

రాణి శంకరమ్మ – పుస్తక సమీక్ష – కె.పి. అశోక్‌కుమార్

కార్టూన్లు: ​

కెవిఎస్-11​

తోట రాజేంద్రబాబు-1

ఈ ఉగాదికి సంచిక ఆరంభమయి ఒక సంవత్సరం పూర్తవుతుంది. ఈ సందర్భంగా సంచికలో కొన్ని మార్పులు ప్రయోగాత్మకంగా చేయాలని సంకల్పం. ఆ వివరాలు ఉగాది సంచికలో ప్రకటిస్తాము. ఎప్పటిలాగే సంచికకు పాఠకాదరణ రోజురోజుకూ పెరుగుతుందని ఆశిస్తున్నాము. మీ సలహాలు, సూచనలు రచనలతో సంచికను పరిపుష్టం చేయండి. తెలుగు సాహిత్యాభివృద్ధిలో భాగం పంచుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here