[dropcap]సం[/dropcap]చిక పాఠకులకు వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని, తెలుగు సాహిత్యం మరింత మున్ముందుగు సాగాలని సంచిక ప్రార్థిస్తోంది.
పాఠకులను ఆకర్షించాలని, పాఠకులను ఆకర్షిస్తూ తెలుగు చదివేవారి సంఖ్యను పెంచుకుంటూ ముందుకు సాగాలన్నది సంచిక అభిమతం. ఇందులో భాగంగా ఉగాది నుంచీ సంచిక కొన్ని ప్రయోగాలు చేస్తోంది. సంచిక పత్రికలో రచనలు వారానికి ఒకసారి కొన్ని, రెండు వారాలకొకసారి కొన్ని, ఇంకొన్ని నెలకొకసారి ప్రచురితమవుతాయి. ఉగాది నుంచి ఈ పద్ధతిలో మార్పు వస్తుంది.
ఒకేసారి అధిక సంఖ్యలో రచనలు అప్‌లోడ్ అవటంవల్ల పాఠకులు అన్ని రచనలను చదవలేకపోతున్నారు. పైపైన వున్న రచనలను చదువుతున్నారు. లేకపోతే తమకు నచ్చిన రచనలను చదువుతున్నారు. ఇందువల్ల చక్కని రచనలు పాఠకుల దృష్టికి రాకుండా పోతునాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రయోగాత్మకంగా సంచికలో రచనలు ఇకపై రోజు విడిచి రోజు అప్‌లోడ్ అవుతాయి. తాజాగా అప్‌లోడ్ అయిన రచనలు సైట్ తెరవగానే కనిపిస్తాయి. అంటే, సంచిక తెరవగానే ముందు తాజా రచనల వివరాలు తెలుస్తాయి. ఆ తరువాత అంతకుముందు అప్‌లోడ్ అయిన రచనలు కనిపిస్తాయి.
అంటే ఆదివారం ఒకేసారి కథలు, ఫేచర్లు, నవలలు, సినిమా రివ్యూలు, పుస్తక పరిచయాలు అప్‌లోడ్ అయ్యే బదులు ఆదివారం సినిమా రివ్యూలు, పుస్తక పరిచయాలు, కొన్ని ఫీచర్లు అప్‌లోడ్ అవుతాయి. ఒకరోజు తరువాత కథలు అప్‌లోడ్ అవుతాయి. రెండు రోజుల తరువాత వ్యాసాలు అప్‌లోడ్ అవుతాయి. ఇలా ఒకేసారి 17 రచనలు లేక 42 రచనలు అప్‌లోడ్ చేసే బదులు రచనలను వారమంతా డిస్ట్రిబ్యూట్ చేయటం వల్ల అన్ని రచనలు పాఠకుల దృష్టికి వచ్చేవీలుంటుంది. రచనలు ఎక్కువ పాఠకులను చేరే వీలుంటుంది. అందుకని ప్రయోగాత్మకంగా ఇకపై సంచికలో రచనలు రోజు విడిచి రోజు అప్‌లోడ్ అవుతూంటాయి. ఆరంభంలో కొంత అలవాటయ్యేంతవరకూ కాస్త అయోమయంగా వుంటుంది. కొన్నాళ్ళకు అలవాటయిపోతుంది. ఈలోగా కొన్నాళ్ళ పరిశీలన తరువాత పునర్విమర్శ జరుగుతుంది. పాఠకుల అభిప్రాయాల ఆధారంగా భవిష్యత్ పథకాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది.
ఈ మార్పులపై మీ అభిప్రాయాలు, సూచనలను ఆహ్వానిస్తున్నాము.
సంపాదక బృందం