[box type=’note’ fontsize=’16’] పర్యావరణం కథలలో భాగంగా, ‘అమ్మమ్మ నేస్తం’ అనే కథలో ఇళ్ళల్లోకి పాములు వచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలో సరళమైన కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]
[dropcap]నా[/dropcap] పేరు అనామిక. నేను ఇప్పుడు మీకు ఒక కథ చెప్పాలి. వింటారా?
“ఓకే. వినండి. మొన్న శనివారం, ఇట్స్ ఏ హాట్ డే అఫ్ సమ్మర్. అమ్మమ్మ డైలీ ఈవెనింగ్ వాక్‌కి వెళ్తుంది. అమ్మమ్మ వాళ్ల ఊరు వెళితే నేను కూడా అమ్మమ్మతో వాకింగ్ వెళ్తాను. సరే ! సరే ! స్టోరీ లోకి వస్తున్నా.
సో ఆ రోజు అమ్మమ్మ వాకింగ్ వెళ్లాలని రెడీ అవున్నది. మా మాగీ అదేనండి, అమ్మమ్మ పెట్ డాగ్ స్ట్రేంజ్‍గా అరుస్తున్నదిట. నాన్ స్టాప్‌గా. యూ నో అమ్మమ్మ ఏదో పిల్లి, మేకలు వచ్చాయి అనుకుందిట.
బట్ మాగీ ఆపకుండా వింతగా అరుస్తుంటే, “వాట్ హ్యాపెన్డ్ మాగీ? ఎందుకు అలా అరుస్తున్నావు ? పిల్లి లేదా ఎలక వచ్చిందా?” అంటూ అమ్మమ్మ మాగీ ఇంటి డోర్ దగ్గరకు వెళ్లి నుంచుని అడిగిందిట.
అప్పుడూ అది అమ్మమ్మని చూసి వాల్ వైపు చూస్తూ ఇంకా గట్టిగా అరుస్తుంటే, అమ్మమ్మ “అక్కడేముంది మాగీ?” అంటూ తల తిప్పి ప్రక్కకి నేల మీదకు చూస్తే ఏముంది… అమ్మమ్మ అలాగే ఫ్రీజ్ అయిపోయిందిట. అక్కడ ఏముందో తెలుసా ? ఊహించండి! చెప్పనా భయపడకూడదు.
ఒకటి… రెండు… మూడు… రెడీ.
బిగ్ కింగ్ కోబ్రా ! తాచు పాము. పాము పడగ విప్పి రెండు అడుగుల ఎత్తులో ఉందిట. మిగిలిన శరీరం అంతా చుట్టలు చుట్టుకుని ఉందిట. అమ్మమ్మకి, కోబ్రాకి మధ్య ఒకే ఒక అడుగు దూరంట. తరవాత ఏమైందని అనుకుంటున్నారు ?
అమ్మమ్మ మాగీ అరుపుకి షాక్ ఫీలింగ్ తగ్గించుకుని ‘హమ్!’ అని బిగ్ జంప్ చేసిందిట వెనక్కి.
మాగీ ఇంకా అరుస్తూ కొంచం ముందుకు వచ్చి స్నేక్‌ని డైవర్ట్ చేసిందట. లేదంటే స్నేక్ అమ్మమ్మని కాటేస్తే… నహీ ! నో ! మై అమ్మమ్మ. ఐ లవ్ హర్.
అమ్మమ్మ కొన్ని అడుగుల దూరం జరిగి భయపడుతూ, మాగీ కోసం టెన్షన్ పడుతూ ఆగి, అదేం రకం పామో అని చూసిందిట. స్నేక్ టైప్ ని గుర్తించాలిట. ఏదైనా జరిగితే ట్రీట్మెంట్‌కి అవసరంట.
కోబ్రా అని తెలిసి లోపలి వెళ్లి మెష్ డోర్ వేసుకుని చూస్తూ ఏమి చెయ్యాలి? అని ఆలోచిస్తూ భయంతో 100 పోలీస్‍కి, ముంబాయిలో ఉన్న మాకు… అదే అమ్మకు, ఊరెళ్లిన గ్రాండ్ పా కి ఫోన్ చేసిందట. భయం, హై టెన్షన్, వివరించలేని ఫీలింగ్‌తో కాల్ చేసిందిట.
నేను చిన్న పిల్లని కదా నాకు అన్ని తెలియవుగా. ఇంతే.
అమ్మ గ్రాండ్‌మాతో “అమ్మా! కామ్ డౌన్. టేక్ ఎ బ్రెత్. కూల్” అని చెప్పింది
“కోబ్రా ! కోబ్రా ! వచ్చింది. “
“ఎక్కడకి?”
“మీనూ! మాగీ ఇంటి లోకి. మాగీ ఎలా అరుస్తొందో విను.”
“ఓకే ఓకే. నువ్వు ఎక్కడున్నావు?”
“ఇంట్లోకి పరుగెత్తి వచ్చాను.”
“ఓకే. స్టే ఇన్ డోర్ ఓన్లీ. ఫ్రెండ్స్ ఫర్ స్నేక్ వాళ్ళకి ఫోన్ చెయ్యి.”
“మీనూ! తొందరగా ఏదైనా చెయ్యి. మాగీని పాము చంపుతుంది. నా మాగీ… చనిపోతుంది. మై మాగీ” అని అమ్మమ్మ ఏడుస్తూ భయంగా అరుస్తున్నది. అమ్మ ఎవరికో కాల్ చేసి “స్నేక్ వచ్చింది. హెల్ప్ మై మామ్” అంది.
కాసేపయ్యాక, అమ్మ అమ్మమ్మకి కాల్ చేసి “ఫ్రెండ్స్ ఫర్ స్నేక్ వాళ్ళు వస్తున్నారు. కీప్ వాచింగ్ స్నేక్ మూమెంట్స్” అంది. అమ్మ కూడా మాగీ కోసం, అమ్మమ్మ కోసం వర్రీ అయింది చాలా.
“అమ్మా! అక్కడి పరిస్థితి ఏంటి?” అని అమ్మ అమ్మమ్మకి ఫోన్ చేసి అడిగింది.
“మీనూ! I am getting help. పోలీస్ అంకుల్ కానిస్టేబుల్‌ని పంపిస్తున్నారు. ఫ్రెండ్స్ ఫర్ స్నేక్స్ వాళ్ళూ వస్తున్నారు.”
“ఓకే గ్రేట్. వాట్ ఎబౌట్ స్నేక్?”
“మాగీ ఇంటి డోర్ దగ్గరే ఉంది. మాగీ అరుపులు వినిపిస్తున్నాయా?”
“ఎస్. ఎస్.”
కొన్ని నిమిషాల తర్వాత అమ్మ అమ్మమ్మకి మళ్ళీ ఫోన్ చేసింది.
“మీనూ! మీనూ!”
“కూల్ కూల్. చెప్పు అమ్మా!”
“మీనూ. మాగీ అరుపులకి స్నేక్ గేట్ క్రింద నుండి వెళ్ళిపోతున్నది.”
“అవునా? కీప్ వాచింగ్. ఎటు వెళ్తున్నది?”
“సరిగ్గా కనిపించటం లేదు. వెయిట్. కానిస్టేబుల్ వచ్చారు.” అంది.
అమ్మమ్మ కానిస్టేబుల్‍కి టార్చ్‌లైట్ ఇచ్చి అతను వాల్ అవతల స్నేక్‌ని వెతుకుతుంటే, అమ్మమ్మ పరుగెత్తుకు బైటకి వెళ్లి మ్యాగీని లోపలికి తెచ్చిందిట. ఈలోపల ఫ్రెండ్స్ ఫర్ స్నేక్ వాళ్ళు వచ్చి డాగ్ మ్యాగీని చూసి స్నేక్‌ని వెతకటం స్టార్ట్ చేసి చాలా సేపు సెర్చ్ చేశారట.
మాగీ అమ్మమ్మ ప్రక్కనే ఉంది. అలెర్ట్ గా.
అమ్మ ఫ్రెండ్స్, అమ్మమ్మ ఫ్రెండ్స్ వచ్చారు. అందరు స్నేక్‌ని వెతికి వెళ్లిపోయందని కన్ఫర్మ్ చేసుకుని అమ్మమ్మకు ధైర్యం చెప్పి మాగీని మెచ్చుకుని కొద్దిసేపటి తరువాత వెళ్లిపోయారు. ఊరెళ్లిన గ్రాండ్ పా ఇంటికి వెంటనే వచ్చేసారు.
పాపం! అమ్మమ్మ! నైట్ నిద్రపోలేక పోయిందిట. నైట్ మేర్స్ వచ్చాయిట. పూర్ గ్రాండ్ మా!
మార్నింగ్ నేను అమ్మని అడిగాను స్నేక్స్ ఎందుకు ఇంటికి వచ్చిందని? స్నేక్‌కి ఇల్లు లేదా? అని.
దానికి అమ్మ “స్నేక్స్ కోల్డ్ బ్లడెడ్. వాటికి ఫుడ్ తిని బాగా డైజెస్ట్ చేసుకోవటానికి ఎండకావాలిట. సో బైటకి వస్తాయట. అంటే కాదు మనము ఉండే చోట్లలో కూల్‌గా, చీకటిగా, చెత్తాచెదారంతో ఉన్న చోట్ల దాక్కుని ఉంటాయట.”
అమ్మ ఇంకా ఏమని చెప్పింది?
హాట్ సీజన్లో స్నేక్స్ ముఖ్యంగా కోబ్రా ఫీమేల్ కోబ్రా దగ్గరకు వెళ్తుందిట. ఫ్రెండ్స్‌ట. చాల స్నేక్స్ నైట్ బైటకి వస్తాయట. ఎలుక బొరియలు ఉంటే వాటిని సిమెంట్‌తో క్లోజ్ చెయ్యాలిట. స్నేక్‌కి ఫుడ్ ఎలుక, కప్ప అని చెప్పింది అమ్మ. స్నేక్ కనిపిస్తే భయంతో దాన్ని డిస్టర్బ్ చెయ్యకుండా సైలెంట్‌గా వెనక్కి దూరంగా రావాలి. మా అమ్మమ్మ చేసినట్లుగా. అరవకూడదు మనం.
స్నేక్‌కి చెవులు ఉండవట. డెఫ్ అంది అమ్మ. నేల మీద వైబ్రేషన్స్‌కి అవి అలెర్ట్ అవుతాయిట. సో మనం దూరంగా ఉంటే అదే వెళ్లిపోతుందిట. దానికి భయమే.
స్నేక్స్ మనకి హెల్ప్ చేస్తాయట. రాడెంట్స్ / ఎలుకలు చాల చాల బాడ్ జబ్బులు క్యారీ చేస్తాయట. రాట్స్‌ని తిని జబ్బులు రాకుండా చేస్తాయట. అంకుల్ చెప్పారు. స్నేక్ కి మనం, కుక్కలు అంటే భయం. సో అవి కూడా పారిపోవడానికి ట్రై చేస్తాయట. అన్ని స్నేక్స్ poison కాదుట. కొన్నే.
బిగ్ స్నేక్ బైట్ కంటే బేబీ స్నేక్ బైట్ చాలా డేంజర్‌ట. బేబీ స్నేక్ విషం అంతా కాటులో ఉమ్ముతుందిట. స్నేక్‌కి 10 అడుగుల దూరంలో ఉండాలిట. పానిక్ అవ్వొద్దుట. ఫ్రెండ్స్ ఫర్ స్నేక్స్ అంకుల్స్‌ని పిలవాలి (ఫ్రెండ్స్ ఫర్ స్నేక్స్ – హెల్ప్‌లైన్ నెంబరు 8374233366).
స్నేక్ బైట్ చేస్తే మూవీలో లాగా అక్కడ కొరకటం లాంటివి చెయ్యవద్దు. డాక్టర్ ట్రీట్మెంట్ చేసేదాకా పరుగెత్తడం, తినటం చెయ్యవద్దుట. పార్కులు, చల్లటి చోట్ల ఉండవచ్చుట. ఒక స్టిక్‌తో నేల మీద టాప్ టాప్ చేస్తే ఆ వైబ్రేషన్‌కి అవి వెళ్ళిపోతాయిట.
వరల్డ్‌లో దాదాపు 300 రకాల స్నేక్స్ ఉంటే 270 రకాలు విషపూరితాలు కాదుట. సిటీల్లో కోబ్రా, rat, Russel viper కనిపిస్తాయిట.
ఆమ్మో! అమ్మ టోల్డ్ సో మచ్. మొత్తానికి మా మాగీ అలెర్ట్‌గా ఉంది, అరచి స్నేక్‌ని భయపెట్టి, మూవ్ కానివ్వకుండా చేసి స్నేక్ పారిపొయ్యెలా చేసి అమ్మమ్మని సేవ్ చేసింది.
బ్రేవ్ బ్రేవ్ మాగీ. స్నేక్ ఉన్న చోటు, వెళ్లిన దోవ మాగీ స్మెల్ చేసిందిట. అంకుల్ గుడ్ వర్క్ అన్నారుట. నెక్స్ట్ టైం మాగీ ఇంకా ఈజీగా స్నేక్‌ని ముందే గుర్తు పట్టి అరుస్తుందిట.
అమ్మమ్మ కాలనీ లోని కిడ్స్ మాగీ ఫ్రెండ్స్. వాళ్లంతా మాగీని మెచ్చుకున్నారు. గుడ్ గర్ల్ మాగీ అని.
మేము హాలిడేస్‌కి అమ్మమ్మ దగ్గరకు వెళ్తున్నాము. నేను మాగీని హాగ్ చేసుకుని లవ్ యు అని చెబుతా.
మీరేమంటారు? డు యు లవ్ మాగీ?