మేలుకొలుపు

0
16

[dropcap]స్వ[/dropcap]స్తి చెప్పుము కంగారు నిచ్చిన విళంబి సంవత్సరానికి
స్వాగతం చెప్పుము బంగారమిచ్చిన వికారి నామవత్సరానికి.

వచ్చింది క్రొత్త సంవత్సరం – పోవాలి ఎదలో మత్సరం.
త్రుంచాలి దురభిమానం -పెంచాలి ఆత్మాభిమానం.
పండు వెన్నెలా నిండు కుండా – నిరతం ఎదగాలి నిండు మనసుల్లో
అంకురించాలి క్రొత్త భావాలు – పాడాలి మధుర ప్రేమ గీతాలు.

మనసు సౌధాలపై పెంచాలి లక్ష్యా తీగను  – పోయాలి బాగాను మన కృషి అనే బలమును
నిలపాలి గురుజన భక్తి – అదియే నిలుచును కడసారి ముక్తి.
ఎన్నడూ తరుగని మంచుకొండలుగ – మిన్నగ ఉంచాలి ప్రగతి కొండలుగ
దరి రానీయకు దౌర్జన్యం – మరిచిపోనీయకు సౌజన్యం
వెనుదీయకు భీతి కొరకు – నిలబడుమెల్లప్పుడు నీతి కొరకు.
అన్యాయం అక్రమాలకు చోటీయకు – ఆప్యాయం, ఆశయాలకు లోటు రానీయకు.
శ్రమించాలి నిస్వార్థముగ – శ్లాఘించునులే వసుధ పరమార్థముగ.

కలపాలి అందరి కరములు – నిలపాలి అందాల శపథాలు
కలిగించు పట్టుదల ప్రమిదను – వెలిగించుము ఆశాజ్యోతిని.
అందరికి ఉండాలి గట్టి తలపు – అదియే కోరుతున్న కొత్తమలుపు (గెలుపు).

నిలపాలి అన్నాచెల్లెళ్ళ అనుబంధం – నిలుచును ఇలలోన ఆనందం.
మెరుగుల కోసం పరుగులెత్తకు – మరి సాధించలేని బరువులెత్తకు.
మరువకుము కన్నతల్లిని – విస్మరించకుము జన్మభూమిని.
నిరతం చేయాలి వందనాలు – మరి దొరతనంగా నిలుచునులే వందనాలు.
rolex datejust pmx017 masculino 42 mm azul marinho mostrador prata ptwrread review

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here