ఎవరిదీ ఆ పిలుపు

0
3

[dropcap]ఎ[/dropcap]వరిదీ ఆ పిలుపు
ఎందుకో ఆ మేల్‌కొలుపు
ఎందుకమ్మా ఓ కోయిలమ్మ
ఈ ముంగిట నీ పిలుపు

ఏటేట మామిడి వేప పూతల్లో
వచ్చే పండగవని తెలుసు
ఏ ముంగిట వాలాలని ఈ ముంగిట వాలావు

నిలువ నీడ లేదు, జానెడు గుడ్డ లేదు
గుక్కెడు గంజికై చెమటోడ్జి బ్రతికేవారిక్కడ
వెళ్ళవమ్మా వెళ్ళు

ఏ ధనికుల ఇంట మహాలక్ష్మివై
ఇనుపపెట్టెలో పసిడి బొమ్మవై
నలగని కరెన్సీ నోట్లతో
తులతూగు వారింట
నవరుచుల వసంతం కురిపించవమ్మ
ఓ కోయిలమ్మ
వెళ్ళవమ్మా వెళ్ళు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here