[dropcap]వి[/dropcap]కారి నామ సంవత్సర నవ వసంతమా ప్రణామం
ఇదే నీకు స్వాగతం సుస్వాగతం
హేమంతానికి వీడ్కోలు చెపుతూ
వికారి నామ సంవత్సర నవ వసంతానికి ఆహ్వానం.
చైత్రవైశాఖాలు వసంతంలో చేసే
ఉత్సవ సందడికి పొందుదాం ఆహ్లాదం
సంపెంగెలు, సురీపొన్నలు తమ పరిమళంతో
చేస్తాయి ప్రకృతిని పరవశం. (వికారి నామ॥)
లేలేత మామిడి చిగుళ్ళు తినే కోయిలల
కుహూ కుహూ నాదాలు విందాం
మనస్సును ఆనందపరిచే వసంత కోయిల
ఆలపించే పంచమ స్వరాన్ని ఆస్వాదిద్దాం. (వికారి నామ॥)
రామచిలుకల ఆనందోత్సాహాల
కోలాహలాన్ని చవిచూద్దాం
పరవశించి ఆడే నెమళ్ళ నాట్యానికి
పరమానందంతో పులకిద్దాం
తన రాకతో ప్రకృతిని రమణీయంగా అలంకరించే
నవ వసంతానికి జేజేలు కొడదాం. (వికారి నామ॥)