[dropcap]నీ[/dropcap] జ్ఞాపకాల పొత్తిళ్ళలో పసిపాపనైనా
మూసి వున్న నా కన్నుల్లో నీ రూపాన్నే కన్నా
నీ మాటల స్వదమాధుర్యాన్ని మనసు నిండా నింపుకున్నా
నీ ఊహల గూళ్ళలో ఆశల చిలుకల్ని పెంచుకున్నా
కానీ నేస్తమా
కాలమనే వేటగాడు ఆ
చిలుకల్ని కసిదీరా నలిపేశాడు
మాధుర్యం నిండుకున్న మాట మిగిలింది
పొత్తిళ్ళు లేని పసిపాప మిగిలింది
తెరుచుకున్న కళ్ళల్లో కన్నీరింకింది
ఓ రెండు కన్నీటి బొట్లు
అప్పుగానైనా ఇవ్వవూ!