[dropcap]ప[/dropcap]ల్లెటూరు
కన్నతల్లి
నీకేం కావాలి
అంటుంది పల్లె
లాలించింది
పాలించింది
విద్యాబుద్ధులు చెప్పింది
నా పల్లెటూరు
అమ్మ ప్రేమను
నాన్న ఆప్యాయతలను
బంధువుల అనురాగాలను
పంచింది నా పల్లెటూరు
అమాయకత్వాలు
ఆదరాభిమానాలు
ప్రేమానురాగాలు
చూపింది నా పల్లెటూరు
రచ్చబండలు
వీధి అరుగులు
వినోద సాధనాలు
నా పల్లెటూరు
కాలువ గట్లకు
చేనుకు చెట్లకు
తిరిగి తిరిగి
అలసిన
నా పల్లెటూరు
ఆటలు పాటలు
సరదాలు సాహసాలు
అంగళ్లు చిరుతిండ్ల
నా పల్లెటూరు
ఇవ్వడమే తెలుసు
పుచ్చుకోవడం తెలియదు
అక్కున చేర్చుకొనేది
నా పల్లెటూరు
కేక వేస్తే నలుగురం కలుస్తాం
కష్ట సుఖాలు చెప్పుకుంటాం
ఆనందం ఉంచుకొనేది
నా పల్లెటూరు
సుఖాలు మరిగిన జనం
నగరాల బాట పట్టి
గ్రామం ఖాళీ అయితుంటే
వెలవెల పోతుంది
నా పల్లెటూరు