[dropcap]ఓ[/dropcap] ప్రజాస్వామ్యమా
ప్రక్షాళన చేసికొమ్ము
భరతమాత గోడు వినుము
బీదవాని బాధ కనుము
ఓటు కంటి నీరు కనుము
ఎండుతున్న పంట కనుము
మండుతున్న ధరలు కనుము
రూపాయి విలువ కనుము
కుంటుతున్న ప్రగతి కనుము
ప్రజాస్వామ్య హక్కు అనే
ఓటు చేసి ఓటరన్న చేతికిస్తే
నోటు చూసి ఆశపోయి
అధికారం అమ్మేసిన
ఓటరన్న మనసు కనుము.
ఓటుహక్కునేమో
లైసెన్సుగా మలచినారు
ప్రజాస్వామ్యమునే
వ్యాపారం చేసినారు
ఏమిటమ్మా దౌర్భాగ్యం
ఎప్పుడమ్మా పరిష్కారం
ఓటరన్న మనసు మార్చి
మంచి బాట నడిపించి
కునుకుతున్న సమాజాన్ని
నిద్రలేపి సాగవమ్మా
జై భరతమాత
జై జై భరతమాత