[dropcap]స[/dropcap]హజ సాంస్కృతిక సంస్థ విజయనగరం నిర్వహించిన ఉగాది బాల కథల పోటీ విజేతలకు బహుమతి ప్రధానం సభ గురజాడ గృహములో తేదీ 21-4-19, సాయంత్రం 6 గంటలకు జరిగింది.
సభాధ్యక్షులు ఎన్.కె.బాబు, ప్రధాన వక్త కథా రచయిత ‘మంజరి ఈ సభలో ప్రథమ బహుమతి రెండు వేల రూపాయలు, పొందిన రచయిత తిరుమల శ్రీ, ద్వితీయ బహుమతి 1500/- పొందిన వసుంధర, తృతీయ బహుమతి 1000/- పొందిన కోనే నాగ వెంకట ఆంజనేయులు, మరియు మూడు ప్రోత్సాహక బహుమతులు 500/- పొందిన ఆంధ్ర గిరిజన ఆశ్రమ పాఠశాల పిల్లలు మరియు నెల్లిమర్ల జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినిలకు 800/- విలువగల బాల సాహిత్యం పుస్తకాలు బహుమతులుగా అందచేశారు. ఈ సమావేశానికి రచయిత వెంకట రావు, భాషా మొదలగువారు పాల్గొన్నారు.
ఎన్.కె.బాబు
అధ్యక్షులు
సహజ సాంస్కృతిక సంస్థ
విజయనగరం.