[dropcap]ఓ[/dropcap] మాట వినవయ్యా వోటరూ!
ఇప్పుడు నీవే మంచి షూటరూ!
దేశ భవిత వుంది నీ చేతిలో!
మళ్ళీ ఈ అవకాశం రాదిప్పటిలో!
ఎలాంటి తలరాతలు రాస్తావో!
ఎవ్వాని వీపుకి వాతలు పెడతావో!
పచ్చనోటు నీ చేత పెడితే!
వోటునమ్మమంటూ వెంటబడితే!
తాత్కాలిక సౌఖ్యాలతో మభ్యపెడితే!
శుష్క వాగ్దాన పర్వోసన్యాసం మొదలెడితే!
సులువుగ బుట్టలో పడకురా వోటరు!
వీళ్ళు
ఈతకాయలను నీకు యెర వేసి,
తాటికాయలు నొక్కేసే రకం నేతలురా!
రక్షణనీయరు,
సరిగదా
నీ భవిత భక్షణలో బకాసుర బంధులు వీరు,
తల తెగినా సరే
నోటుకు లొంగి భవితను తాకట్టు పెట్టకు.
లెక్కలు తేల్చే సమయం వచ్చింది.
నీ లెక్క ఏమిటో తెలియజేయి వోటరూ!
లేకుంటే ఆనక నీను లెక్కించరు వీరు!!
మందు విందుకు సోయి మతి పోతే నీకు,
మత్తు విరిగిన పిదప మిగులు
వెతల బ్రతుకు.
అమ్మనైన, ఆలు బిడ్డలనైనా అమ్మగలమా?
మన వారలందరి భవితకు భధ్రతనిచ్చు
వోటునమ్ముతామా!?
గ్లాసుడు ముందు కోసం?
దోసిటీ కాసుల కోసం!!!
ఇప్పుడు కాళ్ళవేళ్ళా పడతాడు,
పని సాధించి ఆపై నీ కాళ్ళరగదీస్తాడు!
దరిదాపులకు రాడు, రానీయడు.
వోటరూ
నీనిప్పుడు షూటరు!
కళ్ళు తెరచి వర్తిల్లడమే బెటరు…!