[dropcap]అ[/dropcap]మ్మా అంటూ
పదం పలుకుతుంటేనే
మది నిండా ఆనందం!
అమ్మ పంచే ప్రేమ అమృతం వంటిది!
అమ్మ అందించే అనురాగం
వర్ణించడానికి అక్షరాలు చాలవు!
అమ్మ… కదిలే దేవత!
అమ్మ ఒడి… తొలి పాఠశాల!
అమ్మ చెప్పిన స్ఫూర్తివంతమైన
మాటలు… గుర్తుకొస్తుంటే..
అమ్మపట్ల కలిగే ఆరాధన…
మాటలకందని ఓ సుమధుర జ్ఞాపకం!
అమ్మ నమ్మకాన్నెప్పుడూ..
నిలబెట్టేలా సాగుతుంది నా జీవితపథం!
అడగకముందే… అవసరాలని
గుర్తించి… సేవచేస్తూ… అభ్యున్నతిని సదా కాంక్షించేను అమ్మ!
ఆశలకు, ఆశయాలకు దారి చూపే దిక్సూచిలా నిలిచే
నిస్వార్ధమూర్తి… నిత్యచైతన్యస్ఫూర్తి….
ఎవరికైనా అమ్మే కదా!