‘పదసంచిక’ ప్రారంభం – ప్రకటన

0
7

[dropcap]సం[/dropcap]చికలో మరో కొత్త ఫీచర్‌కి స్వాగతం!

గళ్ళ నుడికట్టు వంటి పజిల్స్ వయోభేదం, లింగభేదం, సాంఘిక హోదా వంటి తేడాలు లేకుండా అందరినీ ఆకట్టుకుంటాయి. క్రాస్‌వర్డ్ పజిల్స్ వల్ల మనోవికాసం కలుగుతుందని పరిశోధకులు పేర్కొంటారు.

క్రాస్‍వర్డ్ పజిల్స్ చేసేవారికి సృజనాత్మకంగా ఆలోచించడం అలవడుతుంది, నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు, ప్రశ్నలకు, సవాళ్ళకు… పలు దృక్కోణాలనుంచి పరిష్కారం శోధించే సామర్థ్యం కలుగుతుందని నిపుణులు చెబుతారు. ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయని అంటారు.

కాలక్షేపం కోసం, వినోదం కోసం, విజ్ఞానం కోసం ఉపయోగపడతాయి. ఒంటరిగా ఉన్నా మనతో మనం సమయం గడపవచ్చు.

జవాబుల కోసం ఆధారాలను పలురకాలుగా అన్వయించుకుంటూ మెదడుకు పదునుపెట్టడం వల్ల మైండ్ యాక్టివ్‌గా ఉంటుంది.

తెలుగు గళ్ళ నుడికట్టులను పూర్తి చేయడం వల్ల భాష మెరుగవుతుంది, కొన్ని పదప్రయోగాలను ఎలా చేయాలో తెలుస్తుంది. కొత్త పదాలు తెలుస్తాయి, పర్యాయపదాలు తెలుస్తాయి, కొత్త అర్థాలు తెలుస్తాయి.

పాఠకుల కోరిక మేరకు సంచికలో ఈ ఆదివారం అంటే 12 మే 2019 నుంచి కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళి నిర్వహిస్తున్నారు.

ఆసక్తి ఉన్నవారందరూ ఇందులో పాల్గొనవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here