[dropcap]ప్ర[/dropcap]భవం మొదలు సంధ్యాసమయం వరకూ
అదేమిటో నిరంతరం జీవనపోరాటమే
ఆడపిల్లగా అది తప్పదేమో
పుట్టినప్పటినుంచీ నాకై నేనే
అస్తిత్వం నిలుపుకోవటానికి అన్నట్లు
సంగ్రామం చేస్తూనే ఉన్నా
హక్కుల కోసం మాములే
భావాలను అర్ధంచేసుకోమనీ అర్ధించాలా
అడిగితేనే ఇస్తున్నామా మేము ప్రేమను?
తెలుసుకుని మసలాలి ఇకనైనా!