మనిషి దొరికిపోతున్నాడు – పుస్తక పరిచయం

0
4

[dropcap]గుం[/dropcap]డాన జోగారావు రచించిన 120 కవితల సంపుటి ‘మనిషి దొరికిపోతున్నాడు’.

సమాజంలో భిన్న రూపాలలో మనిషి చిక్కి మోసపోతూ కుట్రలకు బలి అవుతున్నాడు. మాయా ప్రయోగాలకు ప్రభావితుడై నిస్సహాయుడై వేదనలతో మూగగా రోదిస్తున్నాడు. ఈ సంపుటిలో చాలా కవితల్లో నేటి సమాజంలో మనిషి స్థితిగతుల్ని చిత్రీకరించటానికి చేసిన ప్రయత్నం కనిపిస్తుంది.

ఈ కవితలలో కవి ఎక్కడో మాయమై పోతున్నాడనుకున్న మనిషి దొరికిపోతున్నాడని అంటున్నారని ‘మనిషి జాడ పట్టుకున్న కవిత్వం’ అన్న ముందుమాటలో దాట్ల దేవదానం రాజు రాశారు. తపస్సమాధి పొందగలిగే తాదాత్మ్యత, ఆసక్తి, అనురక్తి,  ప్రేమ గుండాన జోగారావుకి ఉందని ఈ సంపుటిలోని కవిత్వం దాఖలాలుగా నిలుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గుండాన జోగారావుకి ప్రతిభ ఉంది, భావనా శక్తి ఉంది. సృజనాత్మకంగా స్పందించే మనసు ఉంది. మంచి కవిత్వం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది అని రాశారు.

ఈ సంపుటి లోని కవితల్లో కొన్ని కవితల శీర్షికలు మచ్చుకి: ‘కవిత్వం గరళ ధారణం’, ‘మనోహర లహరి’, ‘కెందార సమరం’, ‘రణమై… మరణమై… స్మరణమై…’, ‘ఓ గుప్పెడు కవితాక్షరాలకై..’, ‘నిమ్మరితనం’.

***

మనిషి దొరికిపోతున్నాడు (కవిత్వం)
రచన: గుండాన జోగారావు
పేజీలు: 120
వెల: ₹100/-
ప్రతులకు: రచయిత, డోర్ నెంబరు 6-253\6,
శ్రీ సాయినగర్ కాలనీ, సింహాచలం పోస్ట్, విశాఖపట్నం -530028
ఫోన్: 9490185708

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here