[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]
చాణక్యః:
శార్ఙ్గరవ, ఉచ్యన్తా మస్మద్వచనాద్ విశ్వావసు ప్రభృతయః త్రయో బ్రాహ్మణాః “వృషతాత్ ప్రతిగృహ్యాభరణాని భవద్భి రహం ద్రష్టవ్య” ఇతి॥
అర్థం:
శార్ఙ్గరవ! విశ్వావసుప్రభృతయః+త్రయాణాం+బ్రాహ్మణాః = విశ్వావసు మొదలైన ముగ్గురు బ్రాహ్మణులకు (లను), అస్మత్+వచనాత్=నా మాటగా, ఉచ్యన్తాం=చెప్పు (చెప్పబడుగాక), – (ఏమనంటే) – ఆభరణాని=నగలు (నగలను), వృషతాత్+ప్రతిగృహ్య=చంద్రగుప్తుని గృహం నుంచి దానం పట్టి, అహం+భవద్భిః+ద్రష్టవ్యః=మీరు వచ్చి (వెంటనే) నన్ను చూడాలి. (నేను మీచే చూడబడాలి) – ఇతి = అని.
శిష్యః:
తణా (తథా) – (ఇతి నిష్క్రాన్తః)
అర్థం:
తథా =అలాగే, (ఇతి=అని, నిష్క్రాన్తః=వెళ్ళాడు).
చాణక్యః:
ఉత్తరోఽయం లేఖార్థః। పూర్వః కథ మస్తు? ఆః జ్ఞాతమ్। ఉపలబ్ధవా నస్మి ప్రణిధిభ్యో, యథా తస్య మ్లేచ్ఛరాజలోకస్య మధ్యాత్ ప్రధానతమాః పఞ్చ రాజానః పరయా సుహృత్తయా రాక్షస మనువర్తనే॥ తే యథా
అర్థం:
అయం+లేఖార్థః=ఈ అంశం ఉత్తరంలో, ఉత్తరః (అస్తు)=రెండవదిగా ఉండాలి. (అయితే) పూర్వః+కథమ్+అస్తు=దీనికి ముందు ఎలా ఉండాలి (ఏమి వ్రాయాలి?), ఆః+జ్ఞాతమ్=ఆఁ, గుర్తుకు వచ్చింది, ప్రణిధిభ్యః=వేగుల వలన (ద్వారా), ఉపలబ్ధవాన్+అస్మి=నాకు తెలియవచ్చింది, యథా=ఏమనంటే… తస్య+మ్లేచ్ఛరాజలోకస్య+మధ్యాత్=ఆ మ్లేచ్ఛరాజ సమూహంలో (వారి మధ్య), ప్రధానతమాః=అత్యంత ముఖ్యులైన, పఞ్చ+రాజానః=అయిదుగురు రాజులు, పరయా+సుకృతయా=మిక్కిలి స్నేహంతో, రాక్షసం+అనువర్తనే=రాక్షసుడిని సమర్థిస్తున్నారు (అతడి వెంట ఉన్నారు). తే+యథాః=వారి పరిస్థితి ఏమంటే… (ఇది)
శ్లోకం:
“కౌలూత శ్చిత్రవర్మా, మలయనరపతిః
సింహనాదో నృసింహః
కాశ్మీరః పుష్కరాక్షః, క్షతరిపుమహిమా
సై న్ధవః సింధు షేణః।
మేఘాఖ్యః పంచమోఽస్మిన్
పృథుతురగబలః పారసీకాధిరాజో
నామా న్యేషాం లిఖామి ధ్రువ మహ మధునా
చిత్రగుప్తః ప్రమార్ష్టు॥
అర్థం:
కౌలుతః+చిత్రవర్మా=కులూత దేశరాజు చిత్రవర్మ, మలయనరపతిః+నృసింహః+సింహనాదః=మలయదేశాధిపతీ, పరమశ్రేష్ఠుడు అయిన సింహనాదుడు, కాశ్మీరః+పుష్కరాక్షః=కాశ్మీరరాజు పుష్కరాక్షుడు, క్షతరిపు+మహిమా=శత్రురాజుల ఔన్నత్యాన్ని దెబ్బతీయగలవాడు, సింధురాజః=సింధుదేశపు రాజు అయిన, సుషేణః=సుశేణుడు, అస్మిన్+ పఞ్చమః=వారిలో అయిదవ వాడు, పృధుతురగబలః=పెద్ద గుఱ్ఱపుదండు గల, పారసీక+అధిరాజః+మేఘాఖ్యః=పారసీక దేశాన్నేలే మేఘుడనేవాడు, అధునా=ఇప్పుడు, అస్మిన్ (లేఖే)=ఈ లేఖలో, ఏ తేషాం+నామాని= ఈ (అయిదుగురి) పేర్లను, లిఖామి=వ్రాస్తున్నాను. చిత్రగుప్తః=యమధర్మరాజుకు లేఖకుడైన చిత్రగుప్తుడు, ప్రమార్ష్టుః=తుడిచిపెట్టుగాక, ధ్రువమ్=ఇది నిశ్చయం.
వ్యాఖ్య:
ఈ శ్లోకంలో ప్రస్తావించబడిన దేశాలు ఆధునికంగా వ్యవహరించడం ఈ తీరున కనిపిస్తుంది.
కులూత దేశం: సట్లెజ్ (శతధ్రు) నదికి – జలంధర్ సమీపంలో కుడి ఒడ్డు జిల్లా.
మలయ దేశం: తిరువాన్కూరుకు తూర్పుగా, మైసూరుకు దక్షిణంగా ఉన్న దక్షిణ ఘాట్లలో కొంత భాగం.
కాశ్మీర దేశం: ప్రస్తుత కాలపు కాశ్మీరు.
సింధు దేశం: సింధునది ప్రవహించే దేశం.
పారసీక దేశం: పర్షియా (సింధునదికీ దగ్గరగా ఉన్న ప్రాంతంతో కలిపి) –
చాణక్యుడు చారచక్షువు. ఎప్పటికప్పుడు రాక్షసమంత్రి ఎత్తులు, స్నేహాలు, శత్రుసమర్థకులైన స్నేహితులు… – వంటి వివరాలను సేకరించి – పై ఎత్తులు ఎలా వేయగలిగాడో చెప్పే శ్లోకం ఇది. ఈ శ్లోకంలో ‘మేఘాఖ్య’ అనే పాఠానికి బదులు ‘మేధాక్ష’ అనే పాఠం కూడా ఉన్నదని – ఈ నాటకానికి బెంగాలీ, ఇంగ్లీషు, సంస్కృత వ్యాఖ్యాత్రయం కూర్చిన ఎన్.సి. చక్రవర్తి వివరణ.
చాణక్యః:
(విచిన్త్య) అథవా న లిఖామి. సర్వం అనభివ్యక్తమే వాస్తామ్, శార్ఙ్గరవ!!
అర్థం:
(విచిన్త్య=ఆలోచించి), అథవా+న+లిఖామి=పోనీ, వ్రాయనే వ్రాయను, సర్వం+అనభివ్యక్తం+ఏవ+ఆస్తామ్=అంతా అలా మరుగుగానే ఉండనీ… శార్ఙ్గరవా!!
శిష్యః:
(ప్రవిశ్య) ఉపాధ్యాయ! ఆజ్ఞాపయ!
అర్థం:
(ప్రవిశ్య=ప్రవేశించి), ఉపాధ్యాయ=గురువర్యా, ఆజ్ఞాపయ=ఏమి సెలవు (ఆజ్ఞాపించండి).
చాణక్యః:
వత్స, శ్రోత్రియాక్షరాణి ప్రయత్న లిఖితాని। నియతమస్ఫుటాని భవన్తి। తదుచ్యతా మస్మద్వచనాత్ సిద్ధార్థకః; (కర్ణే కథయతి) “ఏభి రక్షరైః కేనాపి కస్యాపి స్వయం వాచ్యమితి అదత్తబాహ్యనామానం లేఖం శకటదాసేన లేఖయిత్వా మాముపతిష్ఠస్వ। న చాఖ్యేయ మస్మై, చాణక్యో లేఖయ తీతి.” ఇతి.
అర్థం:
వత్స=నాయనా, శ్రోత్రియ+అక్షరాణి=వేదం చదువుకున్నవాళ్ళ అక్షరాలు (దస్తూరీ), ప్రయత్న+లిఖితాని=తడుముకుంటూ వ్రాసేవి, నియతం=తప్పక, అస్ఫుటానిభవన్తి=స్పష్టంగా తీర్పుగా ఉండవు (అస్పష్టంగా ఉంటాయి), తత్ (కారణాత్)= అందుమూలంగా, – అస్మత్+వచనాత్= నా మాటగా, సిద్ధార్థకః+ఉచ్యతామ్=సిద్ధార్థుడికి (ఇలా) చెప్పు (చెప్పబడుగాక), (కర్ణే=చెవిలో, కథయతి=చెపుతున్నాడు), “ఏభిః+అక్షరైః=ఈ అక్షరాలతో (దస్తూరీతో), కేన+అపి=ఎవడో (ఎవని చేతో), కస్య+అపి=ఎవడికో, స్వయం+వాచ్యం+ఇతి=స్వయంగా చెప్పవలసి ఉందని, న+దత్త+బాహ్యనామానాం=బయటకి పేర్లు చెప్పకుండా (పేర్లు బయటపెట్టకుండా), శకటదాసేన=శకటదాసుతో, లేఖం+లేఖయిత్వా=ఉత్తరం వ్రాయించి, మాం+ఉపతిష్ఠస్వ=నా దగ్గరకు రా. అస్మై=అతడికి (శకటదాసుకు), చాణక్యః+లేఖయతి+ఇతి=(దీనిని) చాణక్యుడు వ్రాయిస్తున్నాడని, న+ఆఖ్యేయం+చ=చెప్పరాదు కూడా (సుమా!)” – ఇతి=అని.
వ్యాఖ్య:
చాణక్యుడు ముందు తన పథకం ప్రకారం ఒక ఉత్తరాన్ని ఆ అయిదుగురు రాజుల పేర్లు బనాయించి తానే వ్రాద్దామనుకున్నాడు. కాని, ఆలోచించి ఉద్దేశం మార్చుకుని – శిష్యుడి ద్వారా, సిద్ధార్థకుడికి ఒక ఆదేశం జారీ చేశాడు. ఏమని? – “ఎవడో, ఎవరికో వ్రాస్తున్నట్లుగా, – పేర్లేమీ బయటపెట్టకుండా (శిష్యుడి) చెవిలో – ‘నీ చెవిలో చెప్పిన మాటల్ని లేఖ వ్రాయించి (శకటదాసు దస్తూరీతో) నా దగ్గరకు రా’. దీనిని చాణక్యుడు వ్రాయిస్తున్నాడని – సిద్ధార్థకుడు శకటదాసుకు చెప్పరాదని షరతు –
చాణక్యుడు ఎంత ముందుచూపు కలవాడో యీ లేఖారచన ఒక సాక్ష్యం.
శిష్యః:
తథా. (ఇతి నిష్క్రాన్తః)
అర్థం:
తథా=అలాగే, (ఇతి=అని, నిష్క్రాన్తః=వెళ్లిపోయాడు)
చాణక్యః:
(స్వగతమ్) హన్త! జితో మలయకేతుః
అర్థం:
(స్వగతమ్=తనలో), హన్త=భలే, మలయకేతుః+జితః=మలయకేతువును జయించాం (జయించడమైనది!!)
సిద్ధార్థకః:
(ప్రవిశ్య లేఖహస్తః)
అర్థం:
లేఖహస్తః=చేతితో ఉత్తరంతో, ప్రవిశ్య=ప్రవేశించి,
జేదు అజ్జో – అజ్జ, అఅం సో సఅడదాసేణ లిహిదో లేహో. (జయ త్వార్యః – ఆర్య, అయం స శకటదాసేన లిఖితో లేఖః)
అర్థం:
ఆర్యః+జయతు=అయ్యగారికి జయం. ఆర్య=అయ్యా, సః+శకటదాసేన+లిఖితః+లేఖః=ఆ శకటదాసు వ్రాసిన ఉత్తరం (వ్రాయబడిన), అయం=ఇదిగో.
చాణక్యః:
(గృహీత్వా) అహో! దర్శనీయా న్యక్షరాణి. (అనువాచ్య) భద్ర, అనయా ముద్రయా ముద్రయైనమ్.
అర్థం:
(గృహీత్వా=తీసుకుని), అహో!=అదిగదీ! అక్షరాని+దర్శనీయాని=అక్షరాలు చూడసొంపుగా ఉన్నాయి. (అనువాచ్య=తనలోనే చదువుకుని), భద్ర=నాయనా, ఏనమ్=ఈ లేఖను, అనయా+ముద్రయా=ఈ (రాక్షసనామాంకిత అంగుళీయకంతో) ముద్రతో, ముద్రయా=ముద్రించు.
సిద్ధార్థకః:
జం అజ్జో ఆణ వేది. (య దార్య ఆజ్ఞాపయతి.) (తథా కరోతి)
అర్థం:
యత్+ఆర్య+ఆజ్ఞాపయతి=అలాగే, అయ్యగారి ఆజ్ఞ
(తథా=అట్లాగే, కరోతి=చేశాడు)
చాణక్యః:
శార్ఙ్గరవ.
అర్థం:
శార్ఙ్గరవ
శిష్యః:
(ప్రవిశ్య) ఉపాధ్యాయ! ఆజ్ఞాపయ!
అర్థం:
(ప్రవిశ్య=ప్రవేశించి), ఉపాధ్యాయ=అయ్యవారూ, ఆజ్ఞాపయ=ఆదేశించండి.
చాణక్యః:
ఉచ్యతాం మద్వచనాత్ కాలపాశికో దణ్ణ పాళిక శ్చ, యథా వృషలః సమాజ్ఞాపయతి. – “య ఏష క్షపణకో జీవసిద్ధి ర్నామ, రాక్షసప్రయుక్తయా విషకన్యయా పర్వతేశ్వరం ఘాతితవాన్। స ఏన మేవ దోషం ప్రఖ్యాప్య సనికారం నగరా న్ని ర్వాస్యతా” మితి।
అర్థం:
కాలపాశికః+దణ్డపాశికః+చ=కాలపాశిక, దండపాశికులనే (మరణదండనను అమలుచేసే ఉద్యోగులు) ఇద్దరికీ, మత్+వచనాత్=నా మాటగా – యథా+వృషలః+సమాజ్ఞాపయతి=చంద్రగుప్త దేవర ఆజ్ఞగా – ఉచ్యతాం=చెప్పు (చెప్పబడుగాక). “యః+ఏషః+జీవసిద్ధిః నామ+క్షపణకః=ఈ జీవసిద్ధి అనే సన్న్యాసి, రాక్షస+ప్రయుక్తయా=రాక్షసమంత్రి (చేత) ప్రయోగించిన (ప్రయోగించబడిన), విషకన్యయా= విషకన్య ద్వారా (చేత), పర్వతేశ్వరం=పర్వతేశ్వరుడుని, ఘాతితవాన్=చంపించాడు. సః+ఏనం=అట్టి వీడిని, ఏవం+దోషం+ప్రఖ్యాప్య= ఈ తప్పిదాన్ని మోహి (ప్రకటించి), స+వికారం=అవమానపూర్వకంగా, నగరాత్+నిర్వాస్యతాం=ఈ పాటలీపుత్రం నుంచి బహిష్కరించాలి (బహిష్కరింపబడాలి), – ఇతి=అని.
శిష్యః:
తథా
(ఇతి పరిక్రామతి)
అర్థం:
తథా=అలాగే, (ఇతి=అని, పరిక్రామతి=ముందుకు నడిచాడు)
చాణక్యః:
వత్స! తిష్ఠ – “యోఽయ మపరః కాయస్థః శకటదాసో నామ, రాక్షసప్రయుక్తో, నిత్య మస్మచ్ఛరీర మభి ద్రోగ్ధు మిహ ప్రయతతే. స చా ప్యేనం దోషం ప్రఖ్యాప్య శూల మారోప్యతామ్. గృహజనశ్చాస్య బన్ధనా గారం ప్రవేశ్యతా” మితి.
అర్థం:
వత్స=నాయన! తిష్ఠ= (ఒక్క నిముషం) ఉండు. “యః+అయం+అపరః=ఆ రెండోవాడున్నాడే, శకటదాసః+నామ+కాయస్థః=శకటదాసనే కరణం, (సః=వాడు), రాక్షస+నియుక్తః=రాక్షసుడి పంపున, నిత్యం=ఎప్పుడూ, అస్మత్+శరీరమ్+అభిద్రోగ్ధుమ్=నా శరీరానికి హాని చేయాలని, ఇహ+ప్రయతత్తే=ఇక్కడ ప్రయత్నిస్తున్నాడు. సః+చ+అపి=వాడు కూడా, ఏనం+దోషం+ఆరోప్య= ఈ తప్పిదాన్ని మోపి (ప్రఖ్యాప్య=ప్రకటించి), శూలం+ఆరోప్యతామే=శూలం ఎక్కించడమనే శిక్షకు గురికావాలి (గురి చేయబడాలి). అస్య+గృహజనస్య+చ=వాడి కుటుంబాన్ని కూడా, బంధనాగారం+ప్రవేశ్యతాం=కారాగారంలో పెట్టించాలి (ఖైదులో ప్రవేశపెట్టబడాలి)”. – ఇతి=అని.
శిష్యః:
తథా
(ఇతి నిష్క్రాన్తః)
అర్థం:
తథా=అలాగే, (ఇతి=అని, నిష్క్రాన్తః=వెళ్ళాడు)
(సశేషం)