[dropcap]ప్ర[/dropcap]తి జీవి పుట్టుకకు –
ప్రేమబీజం కారణం
కామ సంకల్పం మూలం
మనిషి ఏ పని చేయాలన్నా ఆలోచన ముఖ్యం
శుభ సంకల్పం అయినా
దుష్టచర్య అయినా
ఆలోచనే మొదటి మార్గం
ఆలోచనే మనుషుల
జీవన విధానానికి ద్వారాలు
నీ ఆలోచనే నీ జీవితం
అంటారు విజ్ఞులు
ఆలోచనలు అదుపులో ఉంచుకున్నవారు యోగులు
ఊహాలకు ఆనకట్ట కట్టలేనివారు భోగులు
భోగంలో దుఃఖం ఉంది, రోగం ఉంది
యోగంలో శాంతి ఉంది, ప్రశాంతత ఉంది
సత్సంగంలో పరమానందం దాగి ఉంది
దుస్సంగంలో దుర్భర దుఃఖం దూరి ఉంది
దుష్టశిక్షణ, శిష్టరక్షణ
జరుగుతూనే ఉంటుంది క్షణం, క్షణం
లేకపోతే ఎందుకు జరుగుతాయి
ప్రమాదాలు, ప్రమోషన్లు….