[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]
సిద్ధార్థకః:
(లేఖం ముద్రయిత్వా) అజ్జ, అఅం ముద్దితో లేహో। కిం అవరం అణు చిట్ఠీఅదు (ఆర్య, అయం ముద్రితో లేఖః। కి మపర మనుష్ఠీయతాం।)
అర్థం:
(లేఖం+ముద్రయిత్వా=లేఖ (పై) ముద్రించి), ఆర్య=అయ్యా, అయం+లేఖః+ముద్రితః=ఈ ఉత్తరం (పై) ముద్రించడం పూర్తయ్యింది, అపరం+కిమ్+అనుష్ఠీయతాం?=ఇంకా ఏమి చెయ్యాలి?
చాణక్యః:
భద్ర, కస్మింశ్చి దాప్తజనానుష్ఠేయే కర్మణి త్వాం వ్యాపారయితు మిచ్ఛామి.
అర్థం:
భద్ర=చిరంజీవీ!, కస్మింశ్చిత్=ఒకానొక, ఆప్త+జన+అనుష్ఠేయే+కర్మణి=ఎంతో ఆంతరంగికులు మాత్రమే చేయదగిన పనిలో, త్వాం=నిన్ను, వ్యాపారయితుం+ఇచ్ఛామి=నియోగించాలనుకుంటున్నాను.
సిద్ధార్థకః:
(సహర్షమ్) ఆజ్జ అణుగ్గిహిదో హ్మి। ఆణ వేదు అజ్జో కిం ఇమిణా దాసజణేణ అజ్జస్స అణుచిట్ఠిదవ్వమ్। (ఆర్య, అనుగృహీతోఽస్మి। ఆజ్ఞాపయ త్వార్యః కి మనేన దాస జనేన ఆర్య స్యానుష్ఠాతవ్యమ్।)
అర్థం:
ఆర్య=అయ్యా, అనుగృహీతః+అస్మి=ధన్యుణ్ణి (దయ చూపబడ్డాను), అనేన+ఆర్యస్య+దాసజనేన=ఈ అయ్యగారి దాసుడు (ని – చేత), కిమ్+అనుష్ఠాతవ్యమ్=ఏమి జరగవలసి ఉంది?, ఆర్యః+ఆజ్ఞాపయతు=అయ్యగారు ఆజ్ఞాపించవచ్చు.
చాణక్యః:
ప్రథమం తావ ద్వధ్యస్థానం గత్వా ఘాతకాః సరోష దక్షిణాక్షి సంజ్ఞాం గ్రాహయితవ్యాః। తత స్తేషు గృహీత సంజ్ఞేషు భయాపదేశా దితస్తతః ప్రద్రుతేషు, శకటదాసో వధ్యస్థానా దపనీయ రాక్షసం ప్రాపయితవ్యః। తస్మాచ్చ సుహృ త్ప్రాణపరి రక్షణ పరితుష్టాత్ పారితోషికం గ్రాహ్యం। రాక్షస ఏవకంచిత్కాలం సేవితవ్యః। తతః ప్రత్యాసన్నేషు పరేషు ప్రయోజన మిద మనుష్ఠేయమ్।
(కర్ణే) ఏవ మివ॥
అర్థం:
ప్రథమం తావత్= మొదట చేయవలసిన పని, వధ్యస్థానం+గత్వా=నేరస్థులకు శిక్ష విధించే చోటుకి (శ్మశానానికి) వెళ్ళి – ఘాతకాః=శిక్ష అమలుపరిచే వ్యక్తులు (వ్యక్తులకు), సరోష+దక్షిణ+అక్షి సంజ్ఞాం= కోపంతో కుడి కన్ను గీటడం అనే సంజ్ఞ (చేసి), గ్రాహయితవ్యాః=వారు అర్థం చేసుకునేలాగా ప్రవర్తించాలి. తతః= ఆ మీదట, తేష+గృహీత+సంజ్ఞేషు=వారు అలాగ నీ సంజ్ఞను గ్రహించుకున్నాక, భయ+అపదేశాత్=భయపడిన వంక (మిష)తో, ఇతః+తతః+ప్రద్రుతేషు=ఇటూ అటూ పరుగులు పెట్టేవారి నుంచి, శకటదాసః=శకటదాసు (ను), అపనీయ=తప్పించి (తప్పించబడి), రాక్షసం+ప్రాపయిత్వః= రాక్షసమంత్రి (వద్దకు) చేర్చాలి (చేర్చబడాలి), సుహృత్+ప్రాణపరిరక్షణ+పరితుష్టాత్=స్నేహితుణ్ణి రక్షించిన కారణంగా ఎంతో సంతోషించిన, తస్మాత్=ఆ రాక్షసమంత్రి నుంచి, పారితోషికం=బహుమతిని, గ్రాహ్యం=తీసుకోవాలి (తీసుకోబడాలి), కంచిత్+కాలం=కొంతకాలం, రాక్షసః+ఏవ+సేవితవ్యః=రాక్షసమంత్రి (వద్దనే) సేవ చెయ్యాలి (అతడు సేవించబడాలి). తతః=పిమ్మట, ప్రత్యాసన్నేషు+పరేషు+ఇదం+ప్రయోజనం+అనుష్ఠేయమ్=సమీపంలో శత్రువులుండగా చూసి, ఇలాగ ప్రయోజనం నెరవేర్చాలి.
(కర్ణే=అదేమిటంటే, చెవిలో), ఏవం+ఇవ=ఇలాగన్నమాట.
సిద్ధార్థకః:
జం అజ్జో ఆణ వేది, (య దార్య ఆజ్ఞాపయతి).
అర్థం:
ఆర్యః+యత్+ఆజ్ఞాపయతి=అయ్యగారు ఆజ్ఞాపించినట్లే (చేస్తాను).
చాణక్యః:
(చిన్తాం నాటయిత్వా, ఆత్మగతమ్) అపి నామ దురాత్మా రాక్షసో గృహ్యేత?
అర్థం:
(చింతాం+నాటయిత్వా=ఆలోచించడం ప్రదర్శించి) దురాత్మా+రాక్షసః+గృహ్యేత?+అపినామ= దుర్మార్గుడు రాక్షసమంత్రి, చేతికి చిక్కగలడా? (ఆత్మగతమ్=తనలో).
సిద్ధార్థకః:
అజ్జ గహీదో, (ఆర్య, గృహీతః)
అర్థం:
ఆర్య=అయ్యా, గృహీతః =గ్రహించడమైంది.
చాణక్యః:
(సహర్ష మాత్మగతమ్) హన్త! గృహీతో రాక్షసః!
అర్థం:
(సహర్షమ్+ఆత్మగతమ్=సంతోషంగా, తనలో), హన్త=భళీ, రాక్షసః+గృహీతః=రాక్షసమంత్రి దొరికాడు.
వ్యాఖ్య:
ఈ రెండు సంభాషణా వాక్యాలలో ఒక చమత్కారం ఉంది. చాణక్యుడు వాడిన ‘అపి గృహ్యేత!’ అనే పదంలో “అతగాడు చేతికి చిక్కెనో?” – అని ఉద్దేశం. సిద్ధార్థకుడు వాడిన ‘గృహీతః’ అనే పదంలో “అయ్యా, తమరు చెప్పింది అర్థమైంది (గ్రహించాను)” అని అర్థం. ఆ – ‘గృహీతః’ అనే పదం అందిబుచ్చుకుని ‘గృహీతః రాక్షసః’ – అని చాణక్యుడు తన ఆలోచనను పూర్తి చేసుకున్నాడు. ‘గ్రహించడం’ అనే సంస్కృత పదం వల్ల ఈ చమత్కారం సాధ్యమైంది.
సిద్ధార్థకః:
అజ్జ సందేసో. తాగమిస్సం కజ్జసిద్ధీఏ. (ఆర్య సందేశః. తద్గమిష్యామి కార్యసిద్ధయే.)
అర్థం:
ఆర్య=అయ్యా, సందేశః!= (నేనర్థమైందన్నది) సందేశం!, తత్+కార్యసిద్ధయే+గమిష్యామి= ఆ పని నెరవేర్చడానికి బయలుదేరుతాను.
చాణక్యః:
(సాఙ్గుళిముద్రం లేఖ మర్పయిత్వా) భద్ర, గమ్యతాం, అస్తు తే కార్యసిద్ధిః.
అర్థం:
(స+అఙ్గుళిముద్రం+లేఖం+అర్పయిత్వా=అఙ్గుళీయకంతో కూడా లేఖను [సిద్ధార్థకుడికి] తిరిగి ఇచ్చి), భద్ర=నాయనా, గమ్యతాం=బయలుదేరు. తే+కార్యసిద్ధిః+అస్తు=నీ పని నెరవేరుగాక!
సిద్ధార్థకః:
తహ (తథా). (నిష్క్రాన్తః)
అర్థం:
తథా=అలాగే, (నిష్క్రాన్తః= వెళ్ళాడు)
శిష్యః:
(ప్రవిశ్య) ఉపాధ్యాయ, కాలపాశికో దణ్డపాశిక శ్చ ఉపాధ్యాయం విజ్ఞాపయతః. ఇద మనుష్ఠీయతే దేవస్య శాసన మితి ।
అర్థం:
(ప్రవిశ్య=ప్రవేశించి), ఉపాధ్యాయ= గురుదేవా, దేవస్య+ఇదం+శాసనమ్=చంద్రగుప్తదేవర వారి యీ ఆజ్ఞ, అనుష్ఠీయతే=అమలుపరచడం జరుగుతుంది – ఇతి=అని – కాలపాశికః+దణ్డపాశికః+చ=కాలపాశిక, దణ్డపాశికుల జంట విన్నవిస్తున్నారు.
చాణక్యః:
శోభనమ్. వత్స, మణికార శ్రేష్ఠినం చన్దనదాస మిదానీం ద్రష్టు మిచ్ఛామి.
అర్థం:
శోభనమ్=శుభమ్, వత్స=అబ్బాయీ, మణికారశ్రేష్ఠినం+చన్దనదాసం+ద్రష్టుం+ఇచ్ఛామి=రత్నాల శెట్టి చందనదాసును చూడాలనుకుంటున్నాను.
శిష్యః:
తథా, (ఇతి నిష్క్రమ్య, చన్దన దాసేనసహ, ప్రవిశ్య) ఇత ఇతః శ్రేష్ఠిన్.
అర్థం:
తథా=అలాగే, (ఇతి=అని, నిష్క్రమ్య=వెళ్ళి, చన్దనదాసేన+సహ=చన్దనదాసుతో కూడ (వెంటబెట్టుకుని, ప్రవిశ్య=వచ్చి), శ్రేష్ఠిన్+ఇతః+ఇతః= శెట్టి (గారూ) ఇటు. ఇటు…
చన్దన దాసః:
(స్వగతమ్)
శ్లోకం:
చాణక్కమ్మి ఆకరుణే సహసా
సద్దావిదస్స వి జణస్య!
ణిద్దోసస్స వి సంకా
కిం ఉణ మహ జాద దోసస్స. – 21
(చాణక్యే నాకరుణేన సహసా
శబ్దాపిత స్యాఽపి జనస్య।
నిర్దోష స్యాపి శఙ్కా,
కింపున ర్మమ జాతదోషస్య॥)
అర్థం:
అకరుణేన+చాణక్యేన=జాలిమాలిన చాణక్యుని నుంచి (చేత), సహసా=హఠాత్తుగా, శబ్దాపితస్య=పిలుపు అందుకున్న, నిర్దోషస్య+జనస్య+అపి=ఏ తప్పు చేయని మనిషికి కూడా, శంకా=అనుమానం (భవతి=కలుగుతుంది), జాత+దోషస్య=తప్పిదం ఉన్న, మమ=నాకు (నా విషయంలో), కిం పునః=చెప్పేదేముంది?
అలంకారం:
అర్థాపత్త్యాలంకారము. – నేరం లేని వాళ్ళ సంగతే అలా వుంటే, నా సంగతి చెప్పేదేం ఉందీ? (కిముత?) అనే అర్థంలో కైముతిక న్యాయం ద్వారా ఈ అలంకారం (కైముత్యే నార్థసంసిద్ధిః కావ్యార్థాపత్తి రిష్యతే – అని కువలయానందం).
వ్యాఖ్య:
చాణక్యుని నుంచి పిలుపు రాగానే చందనదాసుకి పరిస్థితి అర్థమైపోయింది. చాణక్యుని దయారాహిత్యం అప్పటికే – నిర్దోషుల పట్ల కూడా – ఎరిగి వున్నవాడు కావడం చేత, కాగల కార్యం, బయలుదేరక ముందే ఊహించి – ఏం చేశాడు అనేది తరువాత వాక్యం చెబుతుంది.
…తా భణిదా మఏ ధణ సేణ ప్పముహా ణిఅనివేస సంఠిఆ క దావి చాణక్కహదఓ గేహం మే విచిణ్ణావేది తా అవహితా ణివ్వ హేహ భట్టిణో అమచ్చరక్ఖసస్స ఘరఅణం. మహ దావ జం హోది తం హోదుత్తి.
(త ద్భణితా మయా ధనసేన ప్రముఖా నిజనివేశసంస్థితా – కదాపి చాణక్యహతకో గేహం మే విచాయయతి । తస్మాదవహితా నిర్వహత భర్తు రమాత్య రాక్షసస్య గృహజనమ్, మమ తావ ద్యద్భవతి తద్భవ త్వతి ॥)
అర్థం:
తత్=ఆ కారణం చేత, నిజ+నివేశ+సంస్థితాః= నా యింట్లో ఉంటున్న, ధనసేనప్రముఖాః=పరివారజనం ధనసేనుడు ఇత్యాదులు, మయా=నా చేత, భణితాః=తెలుపబడ్డారు (నేను వారికి తెలియజేశాను – ఏమని?), కదా+అపి=ఎప్పుడో ఒకప్పుడు, చాణక్య హతకః=చాణక్య చచ్చినోడు (చాణక్య ముండాకొడుకు), మే+గేహం+విచాయయతి=నా ఇంటికి సోదా చేయిస్తాడు. తస్మాత్ (కారణాత్)=అందువల్ల (అది గుర్తెరిగి), భర్తుః+అమాత్యరాక్షసస్య+గృహజనం=మన ఏలిక రాక్షసమంత్రి కుటుంబ సభ్యులు (లను), అవహితాః+నిర్వహత=మెలకువ కలిగి కాపాడాలి. మమతావత్=నా విషయమంటారా, యత్+భవతి+తత్+భవతు= ఏమవుతే కానివ్వండి – ఇతి=అని.
శిష్యః:
భో శ్రేష్ఠిన్, ఇత ఇతః
అర్థం:
భోః+శ్రేష్ఠిన్=అయ్యా శెట్టి గారూ, ఇతః+ఇతః= ఇటు, ఇటు…
చన్దన దాసః:
అజ్జ అఅం ఆఅచ్ఛామి. (ఆర్య, అయం ఆగచ్ఛామి.)
(ఉభౌ పరిక్రామతః)
అర్థం:
ఆర్య=అయ్యా, అయం+ఆగచ్ఛామి=ఇదిగో వస్తున్నాను. (ఉభౌ=ఇద్దరు, పరిక్రామతః=ముందుకు నడిచారు).
(సశేషం)