[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]
చెలికాని అన్నారావు
[dropcap]ప్ర[/dropcap]పంచంలోనే సుప్రసిద్ధ ఆలయంగా వెలసిన తిరుమల తిరుపతి దేవస్థానం సంపన్నమైంది. ఇటీవల తిరువనంతపురంలో బయటపడ్డ అనంత పద్మనాభస్వామి ఆపార స్వర్ణాభరణాలకు ముందు తిరుపతి వెంకటేశ్వరుడే సంపన్నదైవం. ఇప్పటికీ రోజూ హుండీలో కానుకల రూపంలో కోటిరూపాయలు మించి సమర్పించబడతాయి. విశేష దినాలలో ఈ ఆదాయం మూడుకోట్లు దాటింది.
మూడువేల అడుగుల పైన కొండలపై నెలకొన్న కోనేటిరాయుని దర్శనానికి యావద్భారత దేశం నుండి, విదేశాల నుండి లక్షలాది భక్తులు విచ్చేస్తారు. వాహనాలు ఘాట్ రోడ్డుపై సురక్షితంగా ప్రయాణించడం స్వామి కరుణయే. ఈ ఆలయం అతి ప్రాచీనం. 6 శతాబ్దాల చరిత్ర గలది. ‘గోవిందా! గోవిందా!’ అనే నామస్మరణలతో భక్తులు అలిపిరి నుండి కాలినడకన 14 కిలోమీటర్లు పయనిస్తారు. ఇక్కడ ఆదాయంపై ఆధారపడి వేల సంఖ్యలో చిన్న చిన్న వ్యాపారస్థులు లాభం పొందుతుంటారు. ఏటా దేవస్థానం ఆదాయం పెరుగుతూనే వుంది. ఈ ఆలయం సేవలో ఉద్యోగ జీవితాన్ని కొనసాగించిన వారిలో ప్రముఖులు చెలికాని అన్నారావు.
అన్నారావు సామాన్య ఉద్యోగిగా తిరుపతిలో ఉద్యోగ ప్రస్థానం మొదలెట్టారు. కార్యనిర్వహణాధికారిగా రెండు దశాబ్దాలకు పైగా వ్యవహరించారు. దాదాపు 45 సంవత్సరాలు ఉద్యోగించారు. ఆయన చేసిన సంస్కరణలు అనేకం. ఆలయానికి వచ్చే భక్తులను పీడించే పాండాల వ్యవస్థకు స్వస్తి పలికారు. వారిని లైసెన్సుగల గైడ్లగా నియమించారు. అదే విధంగా తిరుమలపై కాటేజ్ నిర్మాణానికి దాతలను ప్రోత్సహించారు. భవన నిర్మాణ ఖర్చులో సగభాగం దాతలు భరించాలి. వారికి సంవత్సరంలో 60 రోజులు ఉచిత వసతి సౌకర్యం కల్పించారు. దాతల వారసులకు కూడా ఇది వర్తిస్తుంది. దర్శన టిక్కెట్లు బ్లాకులో అమ్మడానికి ప్రయత్నించే వారిపై నిఘా పెట్టారు. పదవీ విరమణానంతరం ట్రస్టు బోర్డు అధ్యక్షులయ్యారు. తిరుపతిలో వారి కాంస్యవిగ్రహం ఏర్పరచి అన్నారావు సర్కిల్ అని కపిలతీర్థం రోడ్డులో కూడలి ఏర్పరిచారు.
1975-77 మధ్యకాలంలో అన్నారావు ట్రస్టుబోర్డు అధ్యక్షులు. ఆ సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తన స్వానుభవాలతో బాటు వివిధ ఆలయాలను సందర్శించిన ఆయన Administration of Temples అనే ప్రామాణిక గ్రంథం 1974లో ప్రచురించారు. ఆలయంలో ఎలాంటి సక్రమ పరిపాలన సాగాలో ఆయన సూత్రీకరించారు.
ఆలయ పరిపాలనా విధానం:
తన గ్రంథంలో అన్నారావు ఇలా విపులీకరించారు. 1974 నాటికి వార్షికాదాయం 25 వేల కోట్లు. మిగులు 650 కోట్లు (ఖర్చులు పోను). దేవస్థానంలో 97 విభాగాలున్నాయి. ఆలయ నిధులను 750 బ్యాంకు అకౌంట్ల ద్వారా వినియోగిస్తారు. బొంబాయి స్టాక్ ఎక్స్‌చేంజి లెక్కల ప్రకారం ఆదాయం (టర్నోవర్) లిస్టెడ్ కంపెనీలలో 5వేలలో 300 స్థానం పొందింది.
1932లో తి.తి.దే చట్టం ఏర్పడింది. 1951లో ఐదుగురు బోర్డు సభ్యులుండగా 1987లో ఆ సంఖ్య 13కు పెరిగింది. రోజువారీ కార్యకలాపాలు కార్యనిర్వహణాధికారి పర్యవేక్షిస్తారు. ఆంద్రప్రదేశ్‌లోని దేవాదాయశాఖలో భాగంగా తి.తి.దే ఈ చట్టం ప్రకారం చేరింది. దేవాదాయశాఖ కమీషనరు పర్యవేక్షణ చేస్తారు. వివిధ కాలాలలో బోర్డు అధ్యక్షుల వివరాలివి.
1933-36 మహంత్ ప్రయాగదాస్‌జీ
1936-39 పి.వెంకటరంగరాయణిం
1939-42 టి.ఏ.రామలింగచెట్టియార్
1942-46 రఘునాధరెడ్డి
1946-48 జి.నారాయణ చెట్టి
1948-52 వెంకటస్వమినాయుడు
1952-54 వి.యస్.త్యాగరాజమొదలియార్
1954-56 బి.మోమయ్య
1957-59 ఏ.సి.సుబ్బారెడ్డి(నెల్లూరు)
1960 ఆర్.నాదమునిరెడ్డి(తిరుపతి)
1960-63 పి.యస్ అప్పారావు
1964-67 కె.చంద్రమోళి(గుంటూరు)
1967-69 జి.జగన్నాధరాజు(గొదావరిజిల్లా)
1970 పి.యస్.అప్పారావు
1970-73 జి.రంగరాజు (గోదావరి జిల్లా)
1973-74 ఏ.వల్లియప్పన్,IAS
1974-78 సి.అన్నారావు (తిరుపతి)
1978-79 జి.యన్.రమ్‌శన్, IAS
1980 శ్రావణకుమార్, IAS
1980-83 బి.నాగిరెడ్ డి(మదరాసు)
1983 యల్.సుబ్బయ్య, కె.మురళీధర్, IAS
1983-86 వి.కె.డి.వి.యస్.రాజు
1986-89 డి.సితారామయ్య (చెన్నై)
1989 కె.కళావెంకటరావు
1990 రవీంద్రనాథ చౌదరి
1990 కనుమూరి బాపిరాజు (భీమవరం)
1990-92 తిక్కవరపు సుబ్బరామిరెడ్డి (నెల్లూరు)
1992-93 యం.యస్.రాజాజీ IAS
1993-95 ఏ.బెంగాల్ రెడ్డి(రాజంపేట)
1995 యస్.సత్యనారాయణరావు
1995 పి.వెంకటేశ్వర్లు (హైదరాబాదు)
1996-97 జె.రాంబాబు, IAS
1997-98 కె.రామచంద్రరాజు
1999 కాగితం వెకట్రావు
1999-2002 స్పెసిఫైడ్ అధారిటీ
2002-2003 పప్పుల చలపతిరావు
2003-2004 డి.ఆదికేశవులు నాయుడు
2004 జె.పి.మూర్తి IAS
2004-2006 టి.సుబ్బరామిరెడ్డి
20006-2008 బి.కరుణాకరరెడ్డి (తిరుపతి)
2008-2010 డి.ఆదికేశవులునాయుడు (చిత్తూరు)
2011 స్పెసిఫైడ్ అధారిటీ
2011-2014 కనుమురిబాపిరాజు
ఆ తర్వాత చదలవాడ కృష్ణమూర్తి (తిరుపతి), యాదవ్(ప్రొద్దుటూరు) అధ్యక్షులుగా వ్వహరించారు.
దేవస్థాన కార్యనిర్వహణాధికారులు :
దైవ సన్నిధిలో బాధ్యతలు నిర్వహించడానికి IAS అధికారులు జీవన సాఫల్య పురస్కారంగా భావిస్తారు. వారి ఉద్యోగ జీవితాము తిరుపతిలో పని చేయడం అదృష్టంగా భావిస్తారు. 1933 నుండి నేటి వరకు పని చేసిన E.O.ల వివరాలివి.
తొలి కమీషనర్‌గా 1933-36 మధ్య కె.సీతారామిరెడ్డి పని చేశారు. ఆ తర్వాత ఏ.రంగనాథ మొదలియార్ 1936-39, డా.సి.అన్నారావు 1949-51, బి.నరసింగరావు(1964-65), కె.ఉమాపతి(1965-69), కె.చంద్రమౌళి రెడ్డి 1969-72, సుబ్రమణ్యన్ 1972-74, పి.యస్. రాజగోపాలరాజు (1974-78), పి.వి.ఆర్.కె.ప్రసాద్ (1978-82), జి.కుమారస్వామి రెడ్డి(1982-84), యస్.లక్ష్మీనారాయణ 1984-87, సి.హెచ్.వెంకటపతిరాజు 1987-90, యం.వి.యస్.ప్రసాద్(1990-92), డి.వి.యస్. యన్.మూర్తి 1992-95, యన్.రమేష్‌కుమార్ 1995-96, యం.కె.ఆర్.వినాయక్ 1996-99, ఐ.వి.సుబ్బారావు 1990-2000, పి.కృష్ణయ్య 2000-2002, అజయ్‌కల్లాం 2002-2005, ఏ.పి.వి.యన్.శర్మ 2005-2007, డా. కె.వి.రమణాచారు 2007-2009, ఐ.వై.ఆర్.కృష్ణారావు 2009-2011, యల్.వి.సుబ్రహణ్యం 2011-2013, యం.జి.గోపాల్ 2013-14, డి.సాంబశివరావు 2014-17, అశోక్ కుమార్ సింఘాల్ 2017 నుండి.
ఇప్పటి వరకు 24 మంది E.Oలు పనిచేశారు.
అన్నారావు విశేషత:
కార్యనిర్వహణాధికారిగా, కమీషనరుగా. చైర్మన్‌గా పని చేసిన విశిష్టత ఆయనది. రెండో ఘాట్‌రోడ్డు నిర్మాణం, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయ స్థాపన, ఢిల్లీలో యస్.వి.డిగ్రీకళాశాల, పద్మావతీ మహిళాకళాశాల స్థాపన వారి కృషి ఫలితమే…. ఢిల్లీ, మదరాసు, హైదరాబాదు, బెంగుళూరు నగరాలలో ఇన్‌ఫర్మేషన్ సెంటర్లు వీరి హయాములో నెలకొల్పారు.
అన్నారావు చిరస్మరణీయడుగా తిరుపతి దేవస్థానం ఉద్యోగుల మనఃఫలకాలపై నిలిచిపోయారు. మృదు స్వభావి, కార్యదక్షుడు ఆయన. ఆయన నాలుగు దశాబ్దాలు స్వామి సేవలో తరించి తిరుపతిలోనే కాలధర్మం చెందారు. స్వామి సన్నిధిలో ఒకప్పుడు 14 వేల మంది కొలువు చేసేవారు. ఆకేపాటి చెంగలరెడ్డి ఛైర్మన్ మాటల్లో వారంతా 14 వేలమంది గోపికలు. స్వామి గోపాలకృష్ణుడైన వెంకటరమణుడు.