[dropcap]అ[/dropcap]ల తాకగానే దరి పులకరించింది
నది సొగసుతో తాను పరవశించింది.
కల చెదిరి మదిలోన గుబులాయనేమో
ఒక మనసుకై తనువు పలవరించింది.
తలపైన పూబంతి వికసించెనేమో
ఒక ప్రేమ అనుభూతి పరిమళించింది.
ఇలలోన అందాలు దాగున్నవేమో
ఒక సొగసు వెన్నెలై పరితపించింది.
శిలలోని సొంపులను పరికించితే ‘శ్రీయా’
ఒక మూగ రస జగతి పలుకరించింది.