[dropcap]నా[/dropcap] భావాలు
భయంకరంగా
చెప్పాలి
అనుకున్నాను నేను
నా బాధ్యత సమాజ
శ్రేయస్సు కోసం అని
శాంతిని వహించినాయి…
నా ఊహల్లో బయలుదేరే
అనంత కోటి ఆలోచనలు
అక్షర రూపం చేస్తుంటే
అందులో పేదవాడి
బ్రతుకు ఎక్కడ ఉందని
వెతుకుతున్నాయి.,.
సంఘాన్ని శోధించే కొద్దీ
కుల మత వర్గ
సమ్మిళితమైన
ఈ సంఘాన్ని
నా అక్షరాలతో
ఎలా ఎదిరించాలని
అన్వేషణ చేస్తున్నాయి….
చెత్త కుప్పలపై కనిపించే
పురావస్తువులను
సంచిలోని నిక్షిప్తం చేసే
నిరాశ్రయ బాలుల
పైన అక్షరాల సమూహంతో
వెలుగులోకి తేవాలని
ప్రయత్నాలు చేస్తున్నాయి…
అనాథ స్త్రీల ఆక్రందనలు
సమాజములోని పీడిత
బడుగు బలహీన వర్గాల
కష్టసుఖాలలో నుంచి
నా అక్షరాల సమూహము
బయలుదేరాలని
నిరంతరం తపిస్తూ ఉంటాయి…
శ్రీ శ్రీ ఆవేశాన్ని
నా అక్షరాల ఆకృతులు
ముందుండి నడిపించాలని
కొనసాగించాలని
ఆశిస్తున్నాయి…