[dropcap]ఒ[/dropcap]ళ్ళంతా వెంట్రుకలు
ఎగుడు దిగుడు కదలికలు
చూడగానే రోత పుట్టే
ముట్టుకుంటే దురద పెట్టే
వికృతమైన గొంగళి పురుగు
గట్డిగా గూడు కట్డి
తిండి మాని తపసు చేసి
నూతన దేహంతో, గూడు చీల్చి
రంగు రంగుల రెక్కలతో
చిలుకను మించిన సొగసుతో
విహంగంలా విహరిస్తుంది
సీతాకోకచిలుకగా మారి
తన గుణంతో రోత పుట్టించే
నర గొంగళి పురుగు
సత్కర్మల తపసు చేసి
రంగుల చిలుకలా మారేదెన్నడో