ముద్రారాక్షసమ్ – ప్రథమాఙ్కః – 14

0
4

[box type=’note’ fontsize=’16’] ‘ముద్రారాక్షసం‘ ఏడంకాల రాజకీయ నాటకం. విశాఖదత్తుడు యీ నాటకాన్ని చతుర రాజకీయ వ్యూహాల అల్లికతో, అద్భుతంగా రూపొందించాడు. సంస్కృత సాహిత్యం మొత్తంలో అరుదైన ఈ నాటకాన్ని ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు అనువదించి, వ్యాఖ్యతో అందిస్తున్నారు. [/box]

చాణక్యః:

అన్యచ్చ। నన్దమివ విష్ణుగుప్తః – (ఇత్యర్ధోక్తే లజ్జాం నాటయిత్వా) చన్ద్రగుప్తమమాత్య రాక్షసః సముచ్ఛేత్స్య తీతి మా మైవం మంస్థాః. – పశ్య:

అర్థం:

అన్యత్+చ= ఇంకొకటి కూడా (ఉంది), నందం+విష్ణుగుప్తః+ఇవ= నందుడిని విష్ణుగుప్తుడిలాగా (ఇతి=అని, అర్ధోక్తే+లజ్జాం+నాటయిత్వా=అని సగంలోనే ఆగి, సిగ్గు అభినయిస్తూ) చంద్రగుప్తం= చంద్రగుప్తుణ్ణి, అమాత్యరాక్షసః=రాక్షసమంత్రి, సం+ఉచ్ఛేత్స్యతి+ఇతి=నిర్మూలించగలడని, మా+ఏవం+మంస్థాః= (పొరపాటున కూడా) తలచకు. – పశ్య= చూడు:

శ్లోకం:

విక్రాన్తైర్నయశాలిభిః సుసచివైః
శ్రీ ర్వక్ర నాసాదిభి
ర్నన్దే జీవతి యా తదా న గమితా
స్థైర్యం చలన్తీ ముహుః।
తా మేకత్వ ముపాగతాం ద్యుతి మివ
ప్రహ్లాదయన్తీం జగత్
క శ్చన్ద్రా దివ చన్ద్రగుప్తనృపతేః
కర్తుం వ్యవస్యేత్ పృథక్?
– 23

అర్థం:

నన్దే+జీవతి (సతి)= నందుడు జీవించి ఉండగానే, విక్రాన్తైః+నయశాలిభిః=పరాక్రమం కలవారూ, రాజనీతి విశారదులూ (ల – చేత) అయిన – వక్ర+నాసాదిభిః=వక్రనాశుడు (వంకరముక్కు రాక్షసమంత్రి) మొదలైన (వారి చేత), సు+సచివైః=ఉత్తమ మంత్రులు (ల – చేత), ముహుః=మాటిమాటికి (పదే పదే), చలన్తీ+శ్రీ = తప్పటడుగులు వేసే (ఊగులాడే) సంపద (వైభవం), స్థైర్యం+న+గమితా=స్థిరత్వాన్ని సంతరించుకో(పడలేదు). జగత్=లోకం, ప్రహ్లాదయన్తీం=సంతోషపెట్టబడుతుండగా, ఏకత్వం+ఉపాగతాం=ఏకత్వం సాధింపబడిన, ద్యుతిం+ఇవ=తేజస్సు వలె (మాదిరి), తం+చన్ద్రాత్+ఇవ=(ఆకాశంలో) ఆ చంద్రుని నుంచి మాదిరి, చన్ద్రగుప్త+నృపతేః=చంద్రగుప్తుని (యొక్క తేజస్సును), కః=ఎవడు?, పృథక్+కర్తుమ్=తిప్పికొట్టడానికి, వ్యవస్యేత్=ప్రయత్నిస్తాడు?

వృత్తం:

శార్దూల విక్రీడితం. మ-స-జ-స-త-త-గ గణాలు.

అలంకారం:

వాక్యోపమాలంకారం – వాక్యాల్లోని పదార్థాలన్నింటికీ పరస్పర సామ్యం తెలియజేయడానికి అనేక ‘ఇవ’ శబ్దాలు వాడకుండా ఒక్క ఇవ శబ్దాన్నే ప్రధాన పదార్థంతో చేర్చి చెప్పే ఒక తరహా ఉపమాలంకారం.

(వాక్యార్థేనైవ వాక్యార్థం కోఽపి యద్యుపమీయతే ఏకానేకేవ శబ్దత్వాత్ వాక్యార్థోపమద్విధా – అని కావ్యాదర్శం)

వ్యాఖ్య:

చంద్రుడి నుంచి వెన్నెలను వేరు చేయడం సాధ్యం కానట్టే, చంద్రగుప్తుడి నుంచి అతడి రాజ్యవైభవ శ్రీని ఎవరూ దూరం చేయజాలరని అర్థం. ఈ హెచ్చరిక ద్వారా చందనదాసును భయపెట్టడం చాణక్యుడి ఉద్దేశం.

చాణక్యః:

అపి చ – (ఆస్వాదిత ద్విరదశోణిత ఇతి పూర్వోక్తం పఠతి.)

అర్థం:

అపి+చ = ఇంకా వుంది –

[“ఆస్వాదిత ద్విరదశోణిత” ఇతి= అనే, పూర్వోక్తం=(శ్లోకం), పఠతి= ఇంతకు పూర్వం ప్రస్తావించిన శ్లోకాన్ని చదువుతాడు.]

చన్దన దాసః:

(స్వగతమ్) ఫలేణ సం వాదిదం సే వికత్థిదం. (ఫలేన సంవాదిత మస్య వికత్థితమ్.)

(నేపథ్యే కలకలః)

అర్థం:

(స్వగతమ్=తనలో), అస్య+వికత్థితమ్=ఇతడి బడాయి (ఆత్మప్రశంస), ఫలేన+సంవాదితమ్=ఫలితంతో ఏకీభవిస్తోంది. (ఇతడి బడాయికీ, ఫలితానికీ పొంతన కుదురుతోంది)

(నేపథ్యే=తెరలో, కలకలః=కలకలం)

చాణక్యః:

శార్ఙ్గరవ! జ్ఞాయతాం కి మేతత్.

అర్థం:

శార్ఙ్గరవ! కిం+ఏతత్+జ్ఞాయతామ్=అదేమిటో తెలుసుకో (-బడుగాక).

శిష్యః:

తథా. (ఇతి నిష్క్రమ్య పునః ప్రవిశ్య.) ఉపాధ్యాయ, ఏష రాజ్ఞశ్చన్ద్రగుప్త స్యాజ్ఞయా రాజాపథ్యకారీ క్షపణకో జీవసిద్ధిః సనికారం నగరా న్నిర్వాస్యతే॥

అర్థం:

తథా=అలాగే, (ఇతి=అని, నిష్క్రమ్య=వెళ్లి, పునః+ప్రవిశ్య=తిరిగివచ్చి) ఉపాధ్యాయ=గురుదేవా, రాజ్ఞః+చన్ద్రగుప్తస్య+ఆజ్ఞయా=రాజైన చంద్రగుప్తుని ఆజ్ఞతో, రాజ+అపథ్యకారీ=రాజుగారికి ఇష్టం లేని పని చేసిన కారణంగా, క్షపణకః+జీవసిద్ధిః=జీవసిద్ధి అనే సన్న్యాసి (ని), స+నికారం=అవమాన పూర్వకంగా, నగరాత్+నిర్వాస్యతే=పాటలీపుత్రం నుంచి బహిష్కరించడమైంది.

చాణక్యః:

క్షపణక! అహహ! అథవా అనుభవ రాజా పథ్యకారిత్వస్య ఫలమ్। భోః శ్రేష్ఠిన్, చన్దనదాస! ఏవ మయ మపథ్యకారిషు తీక్ష్ణదణ్డో రాజా। తత్ క్రియతాం పథ్యంసుహృద్వచః। సమర్ప్యతాం రాక్షసగృహజనః। అనుభూయతాం చిరం విచిత్రో రాజప్రసాదః॥

అర్థం:

అహహ!=ఆహా (వెటకారంగా), క్షపణక!=ఏమయ్యా సన్న్యాసీ, అథవా=అట్లాగైతే…  రాజాపథ్యకారిత్వస్య+ఫలమ్=చంద్రగుప్తరాజుకి అనిష్టం తలపెట్టిన ఫలితాన్ని, అనుభవ=అనుభవించు -(శెట్టి వైపు తిరిగి) భోః+శ్రేష్ఠిన్+చన్దనదాస!=అయ్యా, చందనదాస శెట్టిగారు, ఏవం=ఈవిధంగా, అపథ్యకారిషుః=అనిష్టం తలపెట్టేవారి విషయంలో, అయం+రాజా=ఈ రాజు, తీక్ష్ణదండః (భవతి)=తీవ్ర దండన విధించే వ్యక్తి. తత్=అందువల్ల, సుహృద్+వచః=స్నేహ వాత్సల్యంతో నేను చెప్పే మాట…,  పథ్యం+క్రియతాం=నీకు మేలు కలిగేలా చేసుకో (బడుగాక!), రాక్షస+గృహజనః=రాక్షసమంత్రి కుటుంబం (కుటుంబాన్ని), సమర్ప్యతాం= (మాకు) అప్పగించు (అప్పగించబడాలి), విచిత్రః+రాజప్రసాదః=ఆశ్చర్యకరమైన రాజానుగ్రహం (అనుగ్రహాన్ని), అనుభూయతాం=అనుభవించు (అనుభవించబడుగాక!)

చన్దన దాసః:

ణత్థి మే గేహే అమచ్చఘరఆణో. (నాస్తి మే గేహే అమాత్యగృహజనః)

(నేపథ్యే పునః కలకలః)

అర్థం:

అమాత్య+గృహజనః=రాక్షసమంత్రి కుటుంబం, మే+గేహే+నాస్తి=నా ఇంట్లో లేదు.

(నేపథ్యే=తెరలో, పునః+కలకలః=మళ్ళీ కలకలం)

చాణక్యః:

శార్ఙ్గరవ! జ్ఞాయతాం కి మేతత్.

అర్థం:

శార్ఙ్గరవ! కిం+ఏతత్+జ్ఞాయతామ్=అదేమిటో తెలుసుకో.

శిష్యః:

తథా. (ఇతి నిష్క్రమ్య పునః ప్రవిశ్య) ఉపాధ్యాయ. అయ మపి రాజాపథ్యకార్యేవ కాయస్థః శకటదాసః శూల మారోపయతుం నీయతే॥

అర్థం:

తథా=అలాగే! (ఇతి=అని, నిష్క్రమ్య=వెళ్ళి, పునః+ప్రవిశ్య=తిరిగి వచ్చి) అయం+అపి=ఇతను కూడా, రాజ+అపథ్యకారీ+ఏవ=చంద్రగుప్త రాజుగారికి అనిష్టం చేసినవాడే, కాయస్థః+శకటదాసః=శకటదాసనే కరణం (కరణాన్ని), శూలం+ఆరోపయతుం=శూలం ఎక్కించడమనే శిక్ష కోసం, నీయతే=తీసుకుపోవడం జరుగుతోంది.

చాణక్యః:

స్వకర్మ ఫల మనుభవతు। భోః శ్రేష్ఠిన్, ఏవ మయం రాజాపథ్యకారిషు తీక్ష్ణదణ్డో, న మర్ష యతి రాక్షసకళత్ర ప్రచ్ఛాదనమ్ భవతః। త ద్రక్ష పరకళత్రే ణాత్మనః కళత్రం జీవితం చ॥

అర్థం:

స్వ+కర్మఫలం+అనుభవతు=చేసిన పనికి ఫలితం అనుభవించనీ! (చేసుకున్నవాడికి చేసుకున్నంత). భోః+ శ్రేష్ఠిన్=అయ్యా శెట్టిగారూ, ఏవం+అయం+రాజ+అపథ్యకారిషు+తీక్ష్ణ+దండః=ఇలాగే యీ రాజద్రోహులైన వారికి తీవ్ర దండన (ఉంటుంది), భవతః=నీ (యొక్క), రాక్షస+కళత్ర+ ప్రచ్ఛాదనమ్= రాక్షస మంత్రి భార్యను దాచే పని (నేరం), న+మర్షయతి=(రాజు) క్షమించడు. తత్=అందువల్ల, ఆత్మనః+కళత్రం+(తవ) జీవితం+చ=నీ భార్యనీ, నీ జీవితాన్ని కూడా – పరకళత్రేన+రక్ష=ఇతరుడైన రాక్షస మంత్రి భార్యతో (ఆమెను మాకు అప్పగించడం ద్వారా) రక్షించుకో!

చన్దన దాసః:

అజ్జ కిం మే భఅం దావేసి, సప్తం వి గేహో అమచ్చ రక్ఖసస్స ఘరఅణం ణ సమప్పేమి, కిం ఉణ అసన్తమ్। (ఆర్య, కిం మే భయం దర్శయసి? సన్త మపి గేహే అమాత్య రాక్షసస్య గృహజనం న సమర్పయామి కిం పున రసన్తమ్?)

అర్థం:

ఆర్య=అయ్యగారూ, కిం+మే+భయం+దర్శయసి?=నన్నెందుకు భయపెడతారు? (నాకెందుకు భయం కలిగించడం?), అమాత్యరాక్షసస్య+గృహజనం+గేహే+సన్తం+అపి=అమాత్య రాక్షస కుటుంబం (నా) ఇంట్లో ఉన్నప్పటికీ, న+సమర్పయామి=నేను అప్పగించను. కిం+పునః+అసన్తమ్?=లేనివాళ్ళ సంగతి చెప్పేదేముందీ?

చాణక్యః:

చన్దనదాస! ఏష తే నిశ్చయః!

అర్థం:

చన్దనదాస!=చందనదాసూ, ఏషః+తే+నిశ్చయః= (అలాగైతే) అదే నీ నిర్ణయమన్నమాట!

చన్దన దాసః:

బాఢం; ఏసో ధీరో మే ణిచ్చఓ, ( బాఢం; ఏష ధీరో మే నిశ్చయః)

అర్థం:

బాఢం=అంతే! ఏషః+మే+ధీరః+నిశ్చయః=ఇదే నా దృఢ నిశ్చయం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here