[dropcap]సం[/dropcap]చిక-సాహితీ ప్రచురణలు సంయుక్తంగా వెలువరించే మూడవ కథల సంకలనం కోసం రచయితలనుంచి కథలకు ఆహ్వానిస్తున్నాము.
దీపావళికి విడుదలయ్యే ఈ సంకలనంలోని కథల కేంద్రబిందువు కులం. అంటే కులం కేంద్ర బిందువుగా సృజించిన కథలకు ఆహ్వానం. కులం ప్రాతిపదికగా రచించిన ఈ కథలు ఇంతకు ముందే ప్రచురితమయినవి కావచ్చు, లేదా, సంకలనం కోసం ప్రత్యేకంగా సృజించిన కథలయినా ఫరవాలేదు. తాము స్వయంగా రచించకున్నా కులం ఆధారంగా సృజించిన ఇతర రచయితల కథల వివరాలు అందచేస్తే ఆయా రచయితల నుంచి అనుమతి తీసుకుని రచనలను సంకలనంలో ప్రచురిస్తాము.
ఒకవేళ ఈ సంకలనం కోసం ప్రత్యేకంగా కథ రాసి పంపితే, వాటినీ పరిశీలిస్తాము. ఒకవేళ ఆ కథ మేము అనుకున్న పరిథిలో ఇమడకపోతే, దాన్ని సంచిక పత్రికలో ప్రచురిస్తాము. కథను పరిశీలనకు పంపటమే, వాటి ప్రచురణకు అనుమతిగా భావిస్తాము.
కథలు పంపవలసిన ఆఖరు తేదీ- 25 సెప్టెంబర్ 2019.
కథలను ఈమెయిల్ ద్వారా అయితే kmkp2025@gmail.com కు లేదా mmkodihalli@gmail.com కు, వాట్సప్ ద్వారా అయితే- 9849617392 కు,
కొరియర్/పోస్ట్ ద్వారా అయితే,
కస్తూరి మురళీకృష్ణ
ప్లాట్ నెం: 32, ఇంటినెంబరు: 8-48,.
రఘురామ్ నగర్ కాలనీ,
ఆదిత్య హాస్పటల్ లేన్,
దమ్మాయిగూడ,
హైదరాబాద్ 500083
అనే చిరునామాకు పంపించండి.
వివరాలకు సంప్రతించాల్సిన ఫోనునంబరు: 9849617392.
ఇతర కథా సంకలనాలను విజయవంతం చేసినట్టే, ఈ సంకలనం కూడా విజయవంతమవటంలో తోడ్పడండి.