[dropcap]అం[/dropcap]తే లేని కడలికి
ఆ వైపు నువ్వుంటే
ఈ వైపు నేను.
అలల తాకిడి ఓసారి
పెను తుఫాను ఓసారీ
విరహాన్ని విదిలిస్తూనే వున్నాయి.
నీ పిలుపులోని ఆప్యాయత
నీ తలపు రేపిన ప్రేమ
నా మనసుని అలరిస్తునే వున్నాయి.
అలజడి కలిగిస్తూనే వున్నాయి.
ఆనందపు డోల లూగాలని ఆశ
ఆశల నావ నన్ను నీ దరి చేరుస్తుందా
అశ్రువై నిన్ను నా దరికి చేరుస్తుందా?