– [dropcap]‘ఆ[/dropcap]శి’ ఆరోజు బుద్ధ దేవుని దర్శించింది.ఆమె బౌద్ధంను అవలంభిస్తుంది. తన కోరిక తీరాలని తథాగతుని ముందు ఆమె ఒక అగరుబత్తి వెలిగించి ప్రార్థించింది.
బౌద్ధ ఆరామాలలో భక్తులు అలా వెలిగించి తమ కోరికలు నివేదిస్తారు. ధూపము వెలిగించటానికి బుద్ధ దేవాలయాలలో ప్రత్యేకమైన స్థలముంటుంది.
***
– జేమ్స్ చాలా ఆందోళనగా ఉన్న మనసును స్వాధీనపర్చుకొంటూ, కాథలిక్ చర్చ్ ప్రాగణంలో ధూపముతో కూడిన అగరుబత్తి వెలిగించాడు. క్యాథలిక్ చర్చిలో ధూపం వెలిగించి మనసు నెమ్మది పరుచుకోవటం సర్వ సామాన్యమైన విషయం.
***
– ఆనాడు శుక్రవారం. లింగం శెట్టి తన దుకాణం తెరిచిన కాసేపటికి ఫకీరు బాబా చేతిలో ధూపము ఉన్న కుండ పళ్లెంతో వచ్చి, ఆ ధూపంతో దుకాణమంతా చుట్టబెట్టాడు. తిరిగి తిరిగి లింగంశెట్టి ముందు నిలబడ్డాడు బాబా. శెట్టి భక్తిగా ఇచ్చిన రెండు రూపాయలు అందుకొని, కళ్ళకద్దుకొని సాగిపోయాడు ప్రక్కమరో కొట్టుకు. ఫకీరులు పెట్టే సాంబ్రాణి ధూపముతో దుష్టశక్తులు దూరంగా పారిపోతాయని ప్రజల, ముఖ్యంగా వ్యాపారస్తుల నమ్మకము. దర్గాలలో కూడా ఈ ధూపము వెలిగింటము సర్వసామాన్యం.
***
అమెరికా, ఆరిజోనాలో ఉన్న ‘మౌనిక’కు మనసు బాలేదు. తన గృహంలో ఎదో దుష్ట శక్తి తన జీవితాలను అతలాకుతలం చేస్తోందని ఆమె నమ్ముతోంది. దానికి కావలసినన్ని తార్కాణాలు కూడా ఆమెకు సంభవించాయి. మిత్రుల సలహా పై ఈ రోజు ఆమె ‘నినా’ కోసం ఎదురుచూస్తోంది. దాదాపు ఉదయం 10 గంటలకు వచ్చింది ‘నినా’. ఆమె రెడ్ఇండియన్‌గా పిలవబడే అమెరికాలోని ఆది జాతి స్త్రీ. ఇక్కడ రెడ్‌ఇండియన్లు ధూపంతో చేసే ప్యూరిఫికేషన్‌కు దుష్టశక్తులు పారిపోతాయని పేరు.
ఆమె తన సంచి లోంచి కొన్ని సుగంధపు కొమ్మలు, లావెన్డేర్ కొమ్మల కట్టాను తీసి వెలిగించింది. ఆ పొగ సుగంధంగా ఉంది. దట్టంగా వున్న ఆ ధూపం తో ఇంటిని మొత్తం చుట్టపెట్టారు వారు. కొన్ని మంత్రాలూ లాంటివి వల్లించి, ఒక లావాండరు అగరుబత్తి వెలిగించి, ఒక కట్ట మౌనికాకు ఇచ్చి వారు వెళ్లిపోయారు. ఆ సుగంధపు పొగ అన్ని రకాలైన దుష్ట శక్తులను దూరం చేస్తుందని నమ్ముతారు. మౌనిక మనస్సు నెమ్మదించింది ఈ తతంగం తరువాత.
***
రామచంద్రుడు వారింట చేసే ఉదయపు పూజలో అగరుబత్తులు ఎంతో ముఖ్యమైనవి. మనము భగవంతునికి సేవించే షోడషోపచార సేవలలో ధూపము ఒకటి.
ఆ సూర్యోదయ వెలుగులులో సాగుతున్న ప్రశాంత ఉదయాన, అగరుబత్తుల ధూపంతో వారి గృహం పవిత్రంగా విరాజిల్లుతోంది.
***
ఎవ్వరు ఏ విధమైన దేవునికి పూజ చేసినా, ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఈ ‘ధూప’మన్నది వారి ఆచార వ్యవహారాలలో ఎంతో ముఖ్యమైన స్థానంలో ఉంటుంది. మత విశ్వాలను, దేవుళ్లను, దేశాల, ఖండాలను కూడా దాటి దాదాపు 80% ప్రపంచం వాడే ఒకేఒక్క విధానం లేదా పద్ధతిలో ఈ ధూపము వాడుక.
***
అసలు ఎందుకు ధూపమును వాడుతారు?
భగవంతునికి ఇష్టమైన వాటిలో ధూపం ఒకటి. సువాసనభరితమైన ధూపం సమర్పించి భగవంతుణ్ణి ప్రీతి నొందించటానికి, ప్రార్ధనలలో ఈ ధూపం వాడకం కనపడుతుంది.
ధూపం వెలిగించినప్పుడు పొగ రింగులుగా పైకి వెడుతుంది. వాటితో పాటు తమ ప్రార్థనలని కూడా పరమాత్మకు అందచేస్తుందని నమ్ముతారు భక్తులు. అది నమ్మకము!
-మన చుట్టూ వున్న వాతావరణంలో కనపడని ఎనర్జీ ఉంటుంది అన్నది ప్రతి వారు ఒప్పుకున్నదే. ఇలా ఉన్న ఎనర్జీలలో మంచి, చెడ్డ ఎనర్జీలు వుంటాయి. చుట్టూ వున్న ఎనర్జీ మంచిదైతే మనకు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే, చికాకుగా ఉంటుంది. ఇది సాధారణంగా ప్రతివారికి అనుభవమే కుడా! సైన్స్ కూడా మన చూట్టూ అరా వుంటుందని దైవ కణాలు వుంటాయని చెప్పింది.
మనకు కొన్ని ప్రదేశాలలో వెడితే మనలో తెలియని మార్పు వస్తుంది. మనసులోని ఆందోళన తగ్గటం, ప్రశాంతంగా అవటం సంభవిస్తుంది. కొన్ని చోట్ల ఆందోళన అధికంగా ఉంటుంది. ఇది కూడా అనుభవమే కదా! కారణం ఆ ఎనర్జీలలోని మంచి చెడుల తేడా మూలంగా.
ఇలాంటి ఎనర్జీని బ్యాలన్సు చెయ్యటానికి, త్వరత్వరగా మార్పుకై, ప్రశాంతం వాతావరణనికై అతి తేలికైన మార్గం అగరుబత్తి వెలిగించటం.
అగరుబత్తికి నెగటివ్ ఎనర్జీని తగ్గించి మంచిని నింపే గుణం ఉన్నదని పూర్వమే మానవులు కనిపెట్టారు. అందుకే దాని వాడకం మతానికి సంబంధం లేకుండా అందరు పాటిస్తారు వివిధ పద్దతులలో.
చైనీయులు, టిబెట్ లోనివారు, బౌద్ధులు, జైనులు, యూదులు, హిందువులు, అరబ్స్, మహ్మదీయులు, కాథలిక్కులు, క్రిస్టియన్లు ఇలా ప్రతి వారు తమ మాట విశ్వాసానికి సంబంధం లేకుండా, తమ ప్రార్ధనలో ఈ ధూపమన్నది తప్పక వాడుతారు.
***
ధూపానికి – మానవునికి అనాదిగా సంబంధం వుంది.
3000 సంవత్సరాల పూర్వం విరసిల్లిన మొహంజదారో, సింధూ లోయ పరివాహక ప్రాంతాలలోని నాగరికతలో మనకు ధూపం యొక్క ఆనవాలు కనపపడుతాయి.
ఈజిప్టుల పిరమిడ్లలో అనేక వస్తువులతో పాటు ధూపం కి సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి. వాటిని బట్టి ఈజిప్టులో విరసిల్లిన నాగరికతలలో, ఆ రోజులలో ఈ ధూపం వాడేవారని తెలుస్తుంది.
2000 సంవత్సరాల కాలపు చైనా లో భగవంతుని ఆరాదించటానికి ఈ ధూపమన్నది మొదలెట్టారని చరిత్ర చెబుతుంది. నేటికీ చైనాలో వాడే ధూపం మల్లెల, గులాబీల సువాసనలతో ఉంటుంది. చైనాలో కొన్ని పండుగలో ప్రత్యేకమైన ధూపము వాడుతారు. భౌద్ధంలో విరివిరిగా వాడుతారు.
చైనా నుంచే దక్షిణ ఆసియాలో ఈ ధూపమన్నది వ్యాపించిందని చరిత్ర చెబుతుంది. వివిధ రంగులలో సువాసనలలో వుండే అగరుబత్తులలో ఎక్కువగా ఎరుపు, పసువు, నలుపులు దక్షణ ఆసియాలో వాడుతారు. యూదులు, టిబెటన్లు, జపాన్ వారు కూడా వారి మతపరగా, వివిధ పండుగలలో ఈ ధూపవాడకం సామాన్యంగా వాడుకలో వుంది.
క్యాథలిక్‌ల ప్రార్ధనలలో పరిమళం అందించే ఈ ధూపం తప్పని సరిగా ఉండవలసినదే. అమెరికాలో, స్థానిక రెడ్ ఇండియన్స్ అనబడే అమెరికా తెగలు ఈ ధూపం వాడుతారు. భారతదేశం లో హిందువులు వాడే ఈ ధూపం వివిధ సువాసనలతో, రూపాలలో లభ్యమౌతుంది. చందనపు ధూపానికి మంచి, శక్తివంతమైన ఎనర్జీని తెచ్చే లక్షణం ఉంటుంది.
మన ఇళ్ళలో ఏదైనా దుర్ఘటన జరిగిన తరువాత కానీ ఈ చందనపు అగర్బత్తి వెలిగిస్తే వెంటనే ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటకు రావటానికి సహాయం పడుతుంది.
ఇవి మతపరమైనవేగానే కాకుండా ఇంకా మంచి సువాసనల కోసం, దిష్టి వంటివి తగలకుండా ఉండటానికి, దుర్వాసనలు నిలపటానికి కూడా వాడుతారు.
***
ధూపము నేడు బజారులో వివిధ రకాలైనా ధూప్ స్టిక్స్ గానూ, అగరుబత్తులుగాను దొరుకుతున్నాయి.
వీటిని ముఖ్యంగా రెండు రకాలుగా విభజించవచ్చు. పొడి రూపములో, లేదా పేస్టు రూపముగా. పొడిని సుగంధపు నూనెతో కలిపి సన్నని వెదురు పుల్లలకి అద్దుతారు. ఇవి వివిధ రంగులలో, సైజులలో తయారవుతాయి.
సాంబ్రాణి వంటివి చెట్టునుంచి సహజంగా ఉత్పత్తి అవుతాయి. చెట్ల నుంచి వచ్చే ఒక విధమయిన జిగురు తో కూడా సాంబ్రాణి తయారుచేస్తారు.
చిన్నపిల్లలకు స్నానం తరువాత తప్పక ఆ సాంబ్రణి ధూపము వాడుతారు. కారణము సుగంధమే కాదు దూపము చిన్నిపిల్లల చుట్టూ మంచి ఎనర్జనీ వ్యాపింపచేస్తుందని, దిష్టి తగలనియ్యదని కూడా.
భగవంతునుకి, భక్తులకు అనుసంధానం చేస్తూ –
రోజూవారి జీవితాలను సుంగందభరితం చేస్తున్న ఈ అగరుబత్తులు సువాసనలతో మానవాళి మనసులు రంజింపచేస్తున్నాయనటంలో సందేహామే లేదు.