[dropcap]పు[/dropcap]లి నోట్లో గోవు
దొర చేతిలో గోపన్న
పాలిచ్చే గోమాతకి
పంజా దెబ్బలు
భూమి దున్నే గోపన్నకు
వెన్ను పోట్లు
నా బతుకు నా ఇష్డం
నాకెందుకు నీ కష్టం
అనే వారే చుట్టూ ఉంటే
పులి నోట్లో గోవు
దొర చేతిలో గోపన్న
గిల గిల కొట్టుకుంటుంటే
మిగిలేది ప్రశ్నార్థకం…?
కొడవలి పోలిన ప్రశ్న
కంటి నుండి కన్నీరు
వంటి నుండి స్వేదం
గుండె నుండి రక్తం
బొట్డు బొట్టుగా రాలినా
నీ చుట్టూ కోట్ల మంది ఉన్నా
నీకంటూ ఎవరూ సాయం రారు
నీ బతుకు నీవే సరి చేస్కో
నీ దిక్కు నీవే చూస్కో
కొడవలి చేత పట్టు
కడగండ్లను విసిరి కొట్టు