[dropcap]క[/dropcap]లల తీరాల వెంట నడుస్తుంటే..
ఒక్క నువ్వు తప్ప.. కళ్ళకేమీ కానరాని
అంధత్వం లాంటి అయోమయం!
ఊహల లోకంలో విహరిస్తుంటే..
సమ్మోహనంగా నవ్వుతూ నువ్వు..
తేనెల తీయదనాల వంటి మాటల పరిచయం!
ప్రియనేస్తమా.. ప్రాణబంధమా..
నా కలలు.. నా ఊహలు..
అనునిత్యం నిన్నే స్మరిస్తుంటే..
ఇక ఇలలో నేను..
‘నీ నేను!’గా మారిపోతున్నాను!